ఒత్తిడితో కూడిన జీవితంతో సతమతమవుతున్నారు. దీని నుంచి బయట పడాలంటే మాగిన అరటిపండు తినేయండి.

బాగా పండిన అరటి పండులో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది అనేక వ్యాధులను నివారిస్తుంది. కణాలు దెబ్బతినకుండా నిరోధిస్తుంది.

అతిగా పండిన అరటిపండ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి తింటే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.

మాగిన అరటి పండులో ఉండే స్టార్చ్ ఫ్రీ షుగర్ గా మార్చబడుతుంది. దీని వల్ల సులభంగా జీర్ణమవుతాయి.

ఇవి తింటే గుండెల్లో మంట సమస్యను అధిగమించవచ్చు. ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

బాగా పండిన అరటి పండ్ల తొక్కపై ప్రత్యేక రకమైన పదార్థం ఏర్పడుతుంది. దీన్ని ట్యూమర్ నెక్రొసిస్ ఫ్యాక్టర్ అంటారు.

క్యాన్సర్, ఇతర అసాధారణ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.

కండరాల నొప్పి, తిమ్మిరి నుంచి ఉపశమనం పొండటంలో సహాయపడుతుంది.

రోజుకి రెండుకు మించి అరటిపండ్లు తినకుండా ఉండటమే మంచిది.
Image Credit: Pixabay/ Pexels