తొమ్మిది గంటలకు మించి నిద్రపోతే ఏమవుతుంది?



ఒక వ్యక్తి జీవితంలో అతను తీసుకునే ఆహారం, నిద్ర... ఈ రెండే ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఉందో, నిద్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది.



అతి తక్కువగా నిద్రపోతేనే సమస్యలు వస్తాయనుకుంటారు. నిజానికి అతినిద్ర వల్ల కూడా ఎన్నో సమస్యలు వస్తాయి.



పెద్దవారికి ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర సరిపోతుంది. ఎవరైతే ఎనిమిది గంటలకు మించి తొమ్మిది, పది గంటలు నిద్రపోతారో వారిలో కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.



అతిగా నిద్ర పోవడం వల్ల తలనొప్పి వచ్చే ఛాన్సులు ఎక్కువ.



అవసరమైన దానికంటే తక్కువ గంటలు నిద్రపోయే వారిలో కూడా ఊబకాయం వచ్చే ఛాన్సులు ఎక్కువ. కాబట్టి 6 నుంచి 8 గంటల మధ్య నిద్రను ఎంచుకోవడం మంచిది.



అవసరమైన దాని కంటే ఎక్కువ సమయం నిద్రపోయే వారిలో కూడా టైప్2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది.



అవసరమైన దానికంటే ఎక్కువ సమయం నిద్రపోయే వారిలో హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి.



అతినిద్ర కూడా డిప్రెషన్‌కు కారణం అవుతుంది. కాబట్టి మీకు నిత్యం నిద్ర వస్తూ ఉంటే వైద్యుల్ని సంప్రదించడం ముఖ్యం.