రోజుకో స్పూను పీనట్ బటర్ తింటే...



బ్రెడ్‌కి కాస్త పీనట్ బటర్ వేసుకొని తిని ఆఫీసులకి, స్కూళ్లకు వెళ్లేవారు ఎంతోమంది. అందుకే ఇప్పుడు పీనట్ బటర్‌కు అభిమానులు ఎక్కువైపోయారు.



రోజుకి ఒక స్పూన్ పీనట్ బటర్ తినడం వల్ల శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి. అంతే కాదు కొన్ని రకాల వ్యాధులు, ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా ఇది అడ్డుకుంటుంది.



పీనట్ బటర్‌లో ఓలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు, అధిక రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది.



దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ ఏ, మెగ్నీషియం, విటమిన్ బి కూడా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను కాపాడతాయి.



ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి.



దీన్ని తినడం వల్ల ఎక్కువ సమయం పాటు పొట్ట నిండుగా ఉంచడానికి సహాయపడతాయి. ఆకలి త్వరగా వేయదు.



కాబట్టి దీన్ని తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది.



కొంతమందికి పీనట్ బటర్ అలెర్జీ ఉంటుంది. అలాంటివారు దీనికి దూరంగా ఉండటం మంచిది.