అవిసె గింజలు, బాదం, గుమ్మడి గింజలు, సన్ ఫ్లవర్ సీడ్స్... ఇలా ఎన్నో రకాల ఆరోగ్యాన్ని అందించే విత్తనాలు మన ఆహారంలో భాగమయ్యాయి. ఇప్పుడు కొత్త ట్రెండ్ చియా సీడ్స్.
వీటివల్ల బరువు తగ్గడమే కాదు, మధుమేహాన్ని అదుపులో ఉంచే అవకాశం కూడా ఉండడంతో వీటి వాడకం బాగా పెరిగింది.
చియా సీడ్స్‌లో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్, ఫైబర్, ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
రోజూ గ్లాసు నీళ్లలో ఈ చియా సీడ్స్‌ను వేసి నానబెట్టి, ఆ నీళ్లను ఎనిమిది గంటల తర్వాత తాగితే బరువు తగ్గే అవకాశం ఎక్కువ.
చియా సీడ్స్ లో ఉండే ఫైబర్ ఆకలి వేయకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల ఆహారం తీసుకోవడం తగ్గుతుంది.
తద్వారా బరువు తగ్గవచ్చు. వీటిలో అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి. ఆహారం తగ్గించినా కూడా పోషకాహార లోపం తలెత్తదు.
చియా సీడ్స్ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉండే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు చెప్పాయి.
వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగవు, కాబట్టి డయాబెటిస్ అదుపులో ఉంటుంది.