కొత్తిమీరను ఎందుకు వాడాలి?



కొత్తిమీర కేవలం రుచిని, వాసన కోసమే అనుకుంటారు. నిజానికి కొత్తిమీరలో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉన్నాయి.



కొత్తిమీరను రోజూ తినడం వల్ల ఆయుర్వేదంలో చెప్పే వాత, పిత్త, కఫ దోషాలను ఇది హరిస్తుంది.



జీర్ణశక్తిని పెంచి ఆకలి కలిగించేలా చేస్తుంది. జఠర రసాలు ఉత్పత్తి చేసి జీర్ణ క్రియ సజావుగా సాగేలా సహాయపడుతుంది.



శరీరంలో చేరే విషపూరిత ఆహార పదార్థాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలను నివారిస్తుంది.



నోటి దుర్వాసనతో ఇబ్బంది పడే వారికి కొత్తిమీర ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం కొత్తిమీర జ్యూసు తాగితే ఆ రోజంతా నోటి దుర్వాసన నుంచి కాపాడుకోవచ్చు.



యువతలో హార్మోన్ల అసమతుల్యత అనే సమస్య పెరుగుతుంది. ఆ సమస్య నుంచి కాపాడే గుణం కొత్తిమీరకు అధికం.



గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారు కొత్తిమీరను ప్రతిరోజు తినాలి.



దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికం. కాబట్టి దీన్ని తినడం వల్ల శరీరంలో వైరస్, బ్యాక్టీరియాల చర్యలను అడ్డుకోవచ్చు.