ఈ పండ్లు పేరేమిటో తెలుసా?



అరుదుగా మార్కెట్లోకి వస్తుంటాయి మల్బరీ పండ్లు. వీటినే షాహ్‌టూట్ అని కూడా పిలుస్తారు.



ఈ పండులో విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. డైటరీ ఫైబర్, ఫ్లేవనాయిడ్లు కూడా అధికంగా ఉంటాయి.



ఈ పండ్లలో ఉండే ఫ్లేవనాయిడ్లు, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహకరిస్తాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.



రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి ఇది సహాయపడుతుంది.



ఈ మల్బరీ పండ్లలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియ ఆరోగ్యకరంగా జరుగుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.



కంటి ఆరోగ్యానికి మల్బరీ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఇవి వరంలాంటివి.



మల్బరీ పండ్లు అనేక రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి కూడా. రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా ఇవి కంట్రోల్ చేస్తాయి.



సలాడ్లు, స్మూతీలు చేయడానికి, జాములు తయారు చేయడానికి కూడా ఈ మల్బరీ పండ్లను అధికంగా ఉపయోగిస్తారు.