రోటీని నేరుగా మంట మీద కాల్చి తింటే ప్రమాదమా?



రోటీ లేదా చపాతి అనేది భారతీయ భోజనంలో భాగమైపోయింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో రోటీ లేదా చపాతీ లేనిదే వారికి భోజనం పూర్తికాదు.



ఇందులో చపాతీని నూనె వేసి కాలుస్తారు, కానీ రోటీని మాత్రం నూనె లేకుండానే కాలుస్తారు.



చపాతీని పెనంపై కాలిస్తే, రోటీని కొంతమంది నేరుగా మంట మీద పెట్టి కాలుస్తారు.



అధిక ఉష్ణోగ్రత వద్ద ఇలా రోటీని కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.



అధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చడం వల్ల హెటెరోసైక్లిక్ అమైన్‌లు (HCAలు), పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లను (PAHs) ఉత్పత్తి అవుతాయని, అవి క్యాన్సర్ కారకాలని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి.



పొయ్యిలు, కుక్ టాప్‌లు కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాయు కాలుష్యాలను విడుదల చేస్తాయి.



ఇవి ఆరోగ్యకరమైన వాయువులు కాదు శ్వాసకోశ అనారోగ్యాలకు, గుండె నరాలకు సంబంధించిన వ్యాధులకు ఇవి కారణం అవుతాయి.



న్యూట్రిషన్ అండ్ క్యాన్సర్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం అధిక ఉష్ణోగ్రత వద్ద చేసిన వంట క్యాన్సర్ కారకంగా మారుతుందని ఎన్నో అధ్యయనాలు తెలిపాయి.


Thanks for Reading. UP NEXT

హెల్తీ రాగి కేక్ - చేయడం చాలా సులువు

View next story