ఓట్స్ ఇడ్లీ - డయాబెటిస్ ఫుడ్



ఓట్స్ - రెండున్నర కప్పులు
పెరుగు - 1 1/2 కప్పు
బేకింగ్ సోడా - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను
ఇంగువ - చిటికెడు



ఆవాలు - ఒక స్పూను
రవ్వ - రెండున్నర కప్పులు
బఠానీలు - గుప్పెడు
కొత్తిమీర తరుగు - ఒక కట్ట
క్యారెట్ తరుగు - ఆరు స్పూన్లు
నూనె - ఒక స్పూన్
మజ్జిగ - పావు లీటరు



ఓట్స్‌ను పాన్‌లో వేసి చిన్న మంట మీద ఐదు నిమిషాలు వేయించాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి.



రవ్వను కూడా వేయించి, పొడి చేసి ఓట్స్ పిండిలో కలపాలి.



కళాయిలో నూనె వేసి ఆవాలు, క్యారెట్, పచ్చి బఠానీలు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి.



అందులో ఓట్స్ మిశ్రమాన్ని కూడా వేసి వేయించాలి. అందులో ఉప్పు, కొత్తిమీర, వంట సోడా, పెరుగు, మజ్జిగ, కూడా వేసి కలపాలి.



ఇడ్లీ పిండి మందానికి కలుపుకోవాలి. స్టవ్ కట్టేసి మూత పెట్టి కొన్ని నిమిషాలు పక్కన పెట్టండి.



ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసుకుని ఈ మిశ్రమాన్ని ఇడ్లీల్లా వేసుకోవాలి. ఆవిరి మీద ఉడికిస్తే ఇడ్లీ రెడీ అయినట్టే.