పెరుగుతో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు చెక్



శరీరంలోని ప్రధాన అవయవాల్లో ఊపిరితిత్తులు ఒకటి. కానీ అవి క్యాన్సర్ కు గురవుతుండడంతో జీవించడం కష్టతరంగా మారుతోంది.



శరీరంలోని ప్రధాన అవయవాలన్నీ శక్తివంతంగా పనిచేయాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మంచి అలవాట్లే కాదు, మంచి ఆహారం కూడా ఎంతో ప్రభావం చూపిస్తుంది.



క్యాన్సర్ రాకుండా అడ్డుకునే శక్తి పెరుగుకు ఉంది. రోజూ పెరుగు తినేవారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది.



ఎవరైతే రోజూ పెరుగు తింటారో వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ముప్పు చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.



రోజుకు 85 గ్రాములు తగ్గకుండా పెరుగు తినే మగవారికి, 113 గ్రాములకు తగ్గకుండా పెరుగు తినే ఆడవారికి క్యాన్సర్ వచ్చే అవకాశం 19 శాతం వరకు తగ్గుతుంది.



కేవలం పెరుగు మాత్రమే కాదు, ఆహారంలో పీచుపదార్థాలు అధికంగా ఉన్న ఆహారం వల్ల కూడా క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చు.



రోజూ పెరుగు, పీచు పదార్థాలు ఉన్న ఆహారం.... రెండూ తినేవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ముప్పు 33% తగ్గుతున్నట్టు తెలుస్తోంది.



పెరుగు తినడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా ఎంతో మెరుగవుతుంది.