ఉల్లిపాయతో ఇలా చేస్తే జుట్టు రాలదు



ఆధునిక కాలంలో వాయు కాలుష్యం వల్ల, తినే తిండి వల్ల... కారణం ఏదైనా జుట్టు అధికంగా రాలిపోతుంది.



రోజూ ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకొని బలంగా మార్చుకోవచ్చు.



ఉల్లిపాయ రసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు అధికం. ఇవి వెంట్రుకలను బలంగా మారుస్తాయి.



ఉల్లిపాయ రసంలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు విరగడం, రాలిపోవడాన్ని నిరోధించే సమ్మేళనం.



వెంట్రుకలు కుదుళ్ళ నుంచి బలంగా పెరగడానికి సల్ఫర్ సహాయపడుతుంది. ఉల్లిపాయ రసం తలకు పట్టిస్తే వెంట్రుకలు తెల్లబడడం కూడా తగ్గిపోతుంది.



ఈ ఉల్లిపాయ రసం చిట్కా సాధారణంగా జుట్టు రాలుతున్న వారికి మాత్రమే పనిచేస్తుంది. బట్టతల ఉన్నవారు వైద్యులను కలిసి దానికి తగిన చికిత్సలు తీసుకోవడం ఉత్తమం.



ఉల్లిపాయ రసంలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇవి కాలిన గాయాలు, దద్దుర్లు, చికాకు పెట్టే చర్మ సమస్యలకు చెక్ పెడతాయి.