ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. అసంతృప్త కొవ్వులు అందించే గొప్ప మూలం. గుండెకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. రోజుకి రెండు వాల్ నట్స్ నానబెట్టుకుని తింటే చాలా మంచిది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. రక్తశుద్ధి చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి టాక్సిన్స్ ను ఫ్లష్ చేయడంలో సహాయపడతాయి. చర్మాన్ని తేమగా ఉంచడంలో వాల్ నట్స్ చక్కగా పని చేస్తాయి. విటమిన్ ఇ, బి5తో నిండి ఉంటాయి. రంధ్రాలు మూసుకుపోవడాన్ని నివారిస్తుంది. మొటిమలు, వాటి వల్ల వచ్చే సమస్యలను తొలగించడంలో సహకరిస్తాయి. నల్లటి వలయాలను తగ్గించి చర్మాన్ని రిఫ్రెషింగ్ గా చేయడంలో వాల్ నట్స్ పని చేస్తాయి. వాల్ నట్స్ లో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని హైడ్రేట్, హెల్తీగా ఉంచడంలో సహాయపడటయి. రోజుకి 4-5 వాల్ నట్స్ తీసుకుంటే మీ చర్మం మెరుపు సంతరించుకుంటుంది. Images Credit: Pixabay/ Pexels