రోజూ 6 క్యారెట్లు, 50 గ్రాముల బచ్చలికూర వేసుకుని జ్యూస్ గా చేసుకుని ఒక గ్లాసు తాగితే మంచిది. 300 మిల్లీగ్రాముల కాల్షియంను కలిగి ఉంటుంది. రాజ్మా, కాబూలీ చనా, బ్లాక్ దాల్, కులీట్ వంటి పప్పుల ద్వారా కూడా కాల్షియం పొందవచ్చు. ప్రతిరోజు 2-3 టేబుల్ స్పూన్ల తెల్ల లేదా నల్ల నువ్వులు తింటే శరీరానికి కావలసిన కాల్షియం పొందుతారు. బచ్చలికూర, కాలే, బ్రకోలి వంటి ఆకుపచ్చని ఆకు కూరల్లో ఫైబర్, విటమిన్లు, ఐరన్ కలిగి ఉన్నందున ఎముకలకు చాలా మంచిది. సిట్రస్ పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. బెర్రీలు, నారింజ, ద్రాక్షలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఎముకలకు నష్టం కలిగించే ఆహారాలు ఈ ఆహారాలు తినొద్దు అధిక సోడియం ఆహారాలు చక్కెర అధికంగా ఉండే స్నాక్స్. శరీరానికి హాని చేసే కార్బోనేటెడ్ డ్రింక్స్ లో చక్కెర, కెఫీన్ అధికంగా ఉంటుంది. అధిక కెఫీన్ కంటెంట్ ఉండే టీ లేదా కాఫీ తీసుకోవడం వల్ల ఎముకల నుంచి కాల్షియం కోల్పోవడానికి దారి తీస్తుంది.