ఎండలో బాగా తిరిగి వచ్చాక ఒక గ్లాసు చల్లని చెరుకు రసం తాగి చూడండి, నిమిషాల్లో శరీరం తేరుకుంటుంది. డిహైడ్రేషన్ బారిన పడకుండా తట్టుకునే శక్తి దానికి వస్తుంది.
చెరుకు రసంలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి6, విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
మన శరీరం కోల్పోయిన చక్కెరను తిరిగి అందించడం ద్వారా డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది ఈ జ్యూస్.
యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన చెరుకు రసం కాలేయాన్ని పలు రకాల ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.
అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి అవసరమైన ప్రోటీన్లను, పోషకాలను ఇది భర్తీ చేస్తుంది.
ఎండలో బాగా తిరిగాక వడదెబ్బ కొడితే జ్వరం రావడం సహజం. ఆ జ్వరంతో పోరాడే శక్తిని చెరుకు రసం ఇస్తుంది.
కాబట్టి వారానికి రెండు మూడు సార్లు అయినా చెరుకు రసాన్ని తాగడం అలవాటు చేసుకోండి.