పుచ్చకాయతో రక్తపోటు అదుపులో వేసవిలో అధికంగా దొరికే పండు పుచ్చకాయ. దీన్ని తినడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు. పుచ్చకాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పుచ్చకాయ గుజ్జులో బీటాకెరాటిన్ ఉంటుంది. ఇది చర్మం, కళ్లు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అధిక రక్తపోటు ఉన్న వారు పుచ్చకాయ కచ్చితంగా తినాల్సిందే. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటు అదుపులో ఉంటుంది. పుచ్చకాయలో 90 శాతం నీరే ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటికి పోతాయి. పుచ్చకాయలో ఉండే ఆర్జినైన్ అనే అమైనో ఆమ్లం పుండ్లు త్వరగా మానిపోయేలా చేస్తాయి. పుచ్చకాయ తినడం వల్ల తక్షణ శక్త వస్తుంది. నీరసం వెంటనే పోతుంది. పుచ్చకాయ గింజలు బయటపడేస్తారు, కానీ వాటిని కూడా కలిపి తింటేనే ఆరోగ్యం.