కొబ్బరి నీరు వేసవి కూలర్. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఎలక్ట్రోలైట్స్ ని సమతుల్యం చేస్తుంది. సొంపు గింజల్లో యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. గ్యాస్, ఉబ్బరం సమస్యని తగ్గిస్తాయి. గుండెల్లో మంట, పేగుల్లో మంటని తగ్గిస్తుంది. విపరీతమైన వేడిలో కూడా శరీరాన్ని చల్లగా ఉంచే మజ్జిగలో ప్రోబయోటిక్స్ , విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కలబంద సహజ శీతలీకరణ ఏజెంట్. శరీరంలోని వేడిని తగ్గించి పొట్టని చల్లగా ఉంచుతుంది. పుదీనా శరీరం నుంచి వేడిని తొలగిస్తుంది. మజ్జిగలో వేసుకుని తాగితే చాలా మంచిది. పుచ్చకాయ మాదిరిగానే కీరదోసలో అధిక మొత్తంలో నీటి కంటెంట్ ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యని తగ్గిస్తుంది. సెలెరీలో 90 శాతం నీరు, పోషకాలు ఉన్నాయి. వేసవిలో మిమ్మల్ని చల్లగా ఉంచుతాయి. కారంగా ఉండే మిరపకాయలు శరీర ఉష్ణోగ్రతని తగ్గించడంలో సహాయపడతాయి. పేగులకు పెరుగు చాలా మంచిది. ఇందులోని ప్రోబయోటిక్స్ పేగుల్లో మంచి బ్యాక్టీరియాని ప్రేరేపిస్తాయి.