రోజూ ఖర్జూరాలు ఎందుకు తినాలి?



ఖర్జూరాలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని రోజూ తినాల్సిన అవసరం ఉంది.



వీటిలో యాంటీ ఆక్సిండెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండెను రక్షిస్తాయి.



ఖర్జూరాల్లో ఫినోలిక్ ఆమ్లం ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమ్మేటరీ గుణాలు ఎక్కువ. ఇవి క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి.



వీటిలో కాపర్, సెలినియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా మారుస్తాయి.



గాయాలు తగిలితే రక్తాన్ని త్వరగా గడ్డకట్టేలా చేసే విటమిన్ కె ఖర్జూరాల్లో ఉంటుంది.



మెదడు చక్కగా పనిచేయడానికి ఖర్జూరాల్లో ఉండే కోలిన్ అవసరం. అలాగే మతిమరుపు వచ్చే అవకాశం తగ్గుతుంది.



శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయి.



వీటిని మితంగా తీసుకుంటే అంటే రోజుకు రెండు లెక్క తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గే అవకాశం ఉంది.