బాడీ మసాజ్‌తో ఎన్ని లాభాలో బాడీ మసాజ్ మన శరీరానికి చాలా అవసరం. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలను కట్టడి చేస్తుంది. వారానికి ఒక్కసారి బాడీ మసాజ్ చేయించుకున్నా చాలు, ఎన్నో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మసాజ్ చేయడం వల్ల శరీరంలోని కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. తద్వారా ఒత్తిడి తగ్గుతుంది. బాడీ మసాజ్ చేయడం వల్ల శరీరం మొత్తం రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. నిద్రపోయే ముందు మసాజ్ చేయించుకుంటే ఎంతో ప్రశాంతంగా నిద్ర పడుతుంది. బాడీ మసాజ్ చేయడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బాడీ మసాజ్‌లు వారానికి రెండు లేదా మూడుసార్లు చేయించుకుంటే మానసికంగా అలసట తగ్గుతుంది. గాయాల వల్ల కలిగే నొప్పి నుంచి ఈ మసాజ్ ఉపశమనం లభిస్తుంది.