పేగుల ఆరోగ్యానికి పుదీనా చట్నీ



పకోడీలు, సమోసాలు తినేటప్పుడు సైడ్ డిష్‌గా ఉంటుంది పుదీనా చట్నీ. నిజానికి ఈ పకోడీ, సమోసా కన్నా పుదీనా చట్నీ తినడమే ఆరోగ్యానికి ఎంతో మంచిది.



దేశీ చట్నీగా చెప్పుకునే పుదీనా చట్నీ పొట్టలోని పేగుల ఆరోగ్యానికి శక్తివంతమైన ఔషధంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని ‘గట్ ఫ్రెండ్లీ చట్నీ’ అని కూడా పిలుస్తారు.



పుదీనా ఆకుల్లో సహజంగానే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.



పుదీనాలో ఉండే కూలింగ్ శక్తి పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. యాంటీబ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ లక్షణాలు పుదీనాకు అధికం.



పేగులోని మంచి బాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. అందుకే వారానికి రెండుసార్లు పుదీనా చట్నీ తయారు చేసుకుని తినాలి.



మిక్సీలో పుదీనా ఆకులు, మూడు వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, రెండు పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.



ఆ పేస్టును ఒక గిన్నెలో వేసి ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, చాట్ మసాలా చల్లవచ్చు.



దీన్ని తాళింపు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే రుచి బావుంటుంది.