వేసవిలో పటిక బెల్లం ఎందుకు తినాలి?



పటిక బెల్లాన్ని మిశ్రి లేదా ఇండియన్ రాక్ షుగర్ అని పిలుస్తారు. మన తెలుగిళ్లలో ఇది ఉండే అవకాశం ఎక్కువే.



చక్కెర, చెరుకు రసంతో పోలిస్తే పటిక బెల్లంలోనే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ.



సాధారణ చక్కెరకు బదులు పటిక బెల్లాన్ని ఉపయోగించడం వల్ల జీవక్రియకు మేలు కలుగుతుంది.



దీన్ని తినడం వల్ల శరీరం నుంచి వాత, పిత్త, కఫ అనే మూడు దోషాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.



డ్రింకుల్లో పంచదారకు బదులు పటికి బెల్లాన్ని వేస్తే చాలు, ఇది తక్షణ శక్తిని అందిస్తుంది.



జీర్ణ క్రియ వ్యవస్థ ఆరోగ్యానికి కూడా పటిక బెల్లం ఎంతో సహాయపడుతుంది. జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రోత్సహించి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.



ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు ఐరన్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు అవసరం. ఇవన్నీ కూడా పటిక బెల్లంలో ఉంటాయి.



శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించే శక్తి దీనికి ఉంది. పటిక బెల్లంలో గ్లైసిరైసిన్ అనే సమ్మేళనం ఉంది. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ.