బ్రకొలీ అనేది సల్ఫోరాఫేన్‌తో కూడిన క్రూసిఫెరస్ కూరగాయలు. అత్యంత శక్తివంతమైన యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంది. సల్ఫోరాఫేన్ రొమ్ము క్యాన్సర్ కణాల పరిమాణాన్ని 75 శాతం వరకు తగ్గిస్తుంది. బ్రకొలి కోలోరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. టొమాటోలో లైకోపీన్ఉంటుంది. యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి. లైకోపీన్ ఎక్కువగా తీసుకుంటే ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం లైకోపీన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిలిపివేస్తుంది. వెల్లుల్లి క్రమం తప్పకుండా తినడం వల్ల కోలోరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజు ఆహారంలో 2-5 గ్రాముల తాజా వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఫైబర్, ప్రోటీన్లతో కూడిన బీన్స్ కూడా కోలోరెక్టల్ క్యాన్సర్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. బచ్చలి కూర వంటి ఆకు కూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, లుటిన్, విటమిన్ సి ఉన్నాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ కారకాలను నిరోధించడంలో సహాయపడతాయి.