అధిక వేడి కారణంగా చెమట పట్టి దుర్వాసన వస్తూ చాలా చికాకు పెడుతుంది. దాని నుంచి బయటపడేందుకు ఇలా చేసి చూడండి.



యాంటీ పెర్స్పిరెంట్ ఉపయోగించాలి శరీర దుర్వాసన తీవ్రతను తగ్గిస్తుంది.



మీరు ధరించే బట్టలు మీ వాసన మరింత పెంచుతాయి. పాలీస్టర్, స్పాండెక్స్ వంటి దుస్తులు వాసన పెంచుతాయి.
అందుకే కాటన్ దుస్తులు ధరించాలి.


కెఫీన్, ఆల్కహాలిక్ పానీయాలు చెమట పట్టేలా చేస్తాయి. ఉల్లిపాయలు, బ్రకోలి, వెల్లుల్లి, క్యాబేజ్ వంటి సల్ఫర్ అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.



నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.



వేసవికాలంలో ఆకుపచ్చ కూరగాయలు తినాలి. ఇవి సహజమైన డియోడరైజర్ గా పని చేస్తాయి. మీ చర్మాన్ని తాజాగా ఉంచుతాయి.



సేజ్, రోజ్మేరీ, లోవేజ్, సెలెరీ, పార్స్లీ వంటి మూలికలతో హెర్బ్ ఆధారిత డియోడరెంట్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.



లావెండర్ ఆయిల్ అద్భుతమైన డియోడరైజర్ గా పని చేస్తుంది.
ఒక కప్పు నీటిలో 250 గ్రాముల హెర్బ్ తీసుకుని అందులో కొన్ని చుక్కల ఆయిల్ వేసుకుని శరీరానికి స్ప్రే చేసుకోవచ్చు.


యాపిల్ సిడర్ వెనిగర్ శరీర దుర్వాసన పోగొడుతుంది.



శరీర దుర్వాసన వేధిస్తుంటే ఒక కప్పు కర్పూరం టీ తాగి చూడండి. ఒక కప్పు వేడి నీటిలో నిమ్మతొక్క, 3 చుక్కల కర్పూరం నూనె వేసుకోవాలి.