జుట్టుకి నచ్చిన రంగు వేయించుకోవడానికి పార్లర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో దొరికే వాటితోనే సింపుల్ గా జుట్టుకి అందమైన రంగు వచ్చేలా చేసుకోవచ్చు. బ్రూ కాఫీ చేసుకుని అది చల్లారిన తర్వాత జుట్టుకి బాగా పట్టించాలి. కాఫీ జుట్టుకి ముదురు గోధుమ రంగుని ఇస్తుంది. గోరింటాకు పొడిని వేడి నీళ్ళలో కలిపి పేస్ట్ లా చేయాలి. తెల్ల జుట్టుని నల్లగా మారుస్తుంది. జుట్టుకు ఎరుపు, నారింజ రంగుని ఇస్తుంది. చమోమిలే టీ బాగా కాచి చల్లారిన తర్వాత జుట్టుకి పట్టించాలి. చామంతి పూల టీ జుట్టుకి లేత రంగుని అందిస్తుంది. నల్ల వాల్ నట్ పెంకులను చూర్ణం చేసి వాటిని నీటిలో ఉడకబెట్టాలి. దీన్ని చల్లారనిచ్చి జుట్టుకి పట్టించాలి. నలుపు వాల్ నట్స్ ముదురు గోధుమ రంగుని ఇస్తాయి. కొన్ని క్యారెట్ల ఉడకబెట్టి రసం చేసుకుని జుట్టుకి రాసుకోవాలి. ఇది ఎరుపు, నారింజ రంగుని ఇస్తుంది. తాజా నిమ్మరసం జుట్టుకి రాసుకుంటే మంచిది. జుట్టుని మెరిసేలా చేస్తుంది. మంచి అందమైన రంగుని ఇస్తుంది. ఇండిగో పౌడర్ ని వేడి నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకుని జుట్టుకి అప్లై చేయాలి. ఈ నీలిమందు జుట్టుకు ముదురు నీలం, నలుపు రంగుని అందిస్తుంది. Image Credit: Pixabay/ Pexels