స్పైసీగా ఉండే ఫ్రూట్ చాట్ అంటే చాలా మందికి ఇష్టం. నోరూరించే ఈ చిరుతిండి రుచిగా ఉంటుంది.

చాట్ లో భాగంగా ఉప్పు, మసాలా చల్లగానే పండ్ల నుంచి నీరు రావడం ఎప్పుడైనా గమనించారా? ఈ నీరు పోషకాల నష్టాన్ని సూచిస్తుంది.

ఎక్కువ చక్కెరను జోడించడం వల్ల రోజువారీ కేలరీల సంఖ్య పెరిగిపోతుంది.దీని వల్ల బరువు పెరుగుతారు.

పండ్లలో ఉండే పోషకాలు మీరు చల్లుకునే ఉప్పు, కారం, మసాలా చల్లడం వల్ల పోషకాలు నశిస్తాయి.

పండ్ల మీద ఉప్పు చల్లడం వల్ల అనవసరమైన సోడియాన్ని శరీరానికి జోడించినట్టు అవుతుంది.

సోడియం శరీరంలో నీటిని నిలుపుకునేలా చేస్తుంది. దాని వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి.

మసాలాతో కూడిన పండ్లు తినడం వల్ల పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది. దీని వల్ల పొట్ట ఉబ్బరంగా, గ్యాస్ పట్టేసినట్టు ఉంటుంది.

వేసవిలో పండ్ల మీద యాలకులు, మిరియాలు వేసుకుని తినొచ్చు.

శీతాకాలంలో అయితే దాల్చిన చెక్క, లవంగాల పొడిని చల్లుకోవచ్చు.

ఇలా తింటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా రుచికరమైన పండ్లు తిన్న ఫీలింగ్ కలుగుతుంది.