పుచ్చకాయ గింజలు కచ్చితంగా తినాలా? పుచ్చకాయ గింజల్ని తినకుండా ఉమ్మేస్తారు అందరూ. కానీ కచ్చితంగా వాటిని తినాల్సిందే. వాటిని తినడం వల్ల శరీరానికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. పుచ్చకాయ గింజల్లో మెగ్నీషియం, పొటాషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ రక్తపోటును తగ్గిస్తాయి. ఇవి ఎముకలను కాపాడతాయి. ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మెదడు ఆరోగ్యానికి ఈ పుచ్చకాయ గింజలు మేలు చేస్తాయి. ఆ గింజల్లో ఉండే విటమిన్ బి ఎంతో సహకరిస్తుంది. పుచ్చకాయ గింజల్ని వేరుచేసి వేయించుకుని తింటే మంచిది. ఈ గింజల్లో మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండెపోటు రాకుండా అడ్డుకుంటాయి. రక్తంలో హిమోగ్లోబిన్ పెంచేందుకు ఇవి ఉపయోగపడతాయి.