కాఫీతో డయాబెటిస్ రాదా? కాఫీ తాగితే డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గుతుందని ఓ అధ్యయనం చెబుతోంది. యూరోప్‌లోని శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం రక్తంలో కెఫీన్ ఉన్న వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గుతుంది. రోజుకో ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. అంతకన్నా ఎక్కువ తాగితే మాత్రం ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ కాఫీ తాగడం వల్ల డయాబెటిస్ రాదని తాము చెప్పడం లేదని అంటున్నారు పరిశోధకులు. కెఫీన్ అధికంగా శరీరంలో చేరితే గుండె వేగం పెరగడం, మానసిక ఆందోళన, నిద్రలేమి, తలనొప్పి, వణుకు వంటివి వస్తాయి. కాబట్టి రోజుకు రెండు కాఫీలతో ఆపేయాలి. అంతకుమించి తాగకూడదు.