వేసవిలో అందరూ ఎదురు చూసేది మామిడి పండ్ల కోసం. యాంటీ ఆక్సిడెంట్ల పవర్ హౌస్ గా దీని గురించి చెప్తారు. మామిడి పండ్లు రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నవారు, బరువు తగ్గాలని లక్ష్యం పెట్టుకున్న వాళ్ళు తినాలంటే ఆలోచిస్తారు. మధుమేహులు ఈ పండు తినొచ్చు కానీ మితంగా మాత్రమే తీసుకోవాలి. షుగర్ లెవల్స్ చూసుకుంటూ మామిడి పండు పరిమాణం ఆధారంగా వాటిని తినాలి. మామిడి పండ్లు రకం, పక్వతను బట్టి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలపై మితమైన ప్రభావాన్ని చూపుతాయి. మామిడి పండ్లను తక్కువ పరిమాణంలో తినాలి. అర కప్పు లేదా ఒక చిన్న కప్పు వరకు పరిమితం చేయాలి కాయ పట్టుకున్నప్పుడు గట్టిగా, తీపి వాసన కలిగిన పండిన మామిడి పండ్లను ఎంచుకుంటే మంచిది. మామిడి తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ద్రాక్ష, అరటిపండ్లు, చెర్రీస్ వంటి అధిక చక్కెర కలిగిన ఇతర పండ్లతో పాటు మామిడి పండ్లు తినొద్దు మామిడి రసానికి దూరంగా ఉండాలి.