ఎక్కువసేపు స్క్రీన్స్ కు అతుక్కుపోయి పనులు చేస్తూ ఉంటారు. దాని వల్ల కళ్ళు దెబ్బతింటాయి. ఇది కంటి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని వల్ల కళ్ళు పొడి బారిపోవడం, మంటలు, తలనొప్పి వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిరంతరం స్క్రీన్ చూస్తున్నప్పుడు మీరు తప్పనిసరిగా 20-20-20 రూల్ పాటించి చూడండి. ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల పాటు విరామం తీసుకోండి. స్క్రీన్ కాకుండా దృష్టి 20 అడుగుల దూరంలో వేరే దాన్ని చూస్తే మంచిది. తప్పనిసరిగా కళ్ళు రెప్పలు వేయడం చేయాలి. ఇది కళ్ళలో తేమ స్థాయిని తగ్గించకుండ ఉంచడంలో సహాయపడుతుంది. చీకటిగా ఉన్న గదులు కాకుండా బాగా వెలుతురుగా ఉన్న గదిలో మీ ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ పెట్టుకుని పని చేసుకోండి. మసక వెలుతురు కళ్ళని దెబ్బతీస్తుంది. ఇవి కంటిపై మరింత ఒత్తిడిని తీసుకొస్తాయి. స్క్రీన్ నుంచి వచ్చే నీలికాంతి కళ్ళని డ్యామేజ్ చేస్తుంది. కళ్ళకి స్క్రీన్ కి తగిన దూరం పాటించడం చాలా ముఖ్యం. లేదంటే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కువగా స్క్రీన్ చూసే వాళ్ళు కంటికి హాని కలగకుండా ఉండే యాంటీ గ్లేర్ వాడటం మంచిది. Image Credit: Pexels