సాయంత్రం టీ వీళ్లు తాగకూడదు చాలామందికి ఉదయం టీ తాగడంతో పాటూ, సాయంత్రం పూట టీ తాగే అలవాటు కూడా ఉంటుంది. సాయంత్రం పూట టీ తాగే అలవాటును కొంతమంది మానుకోవాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. సాయంత్రం, ఉదయం ఇలా రెండుసార్లు టీ తాగే అలవాటును మానుకోవాల్సిన అవసరం ఉంది. టీ ఉదయం తాగితే ఆరోగ్యాన్ని అందిస్తుంది, కానీ సాయంత్రం తాగడం వల్ల సమస్యలను తెచ్చిపెడుతుంది. మానసిక ఆందోళన, యాంగ్జైటీ, ఒత్తిడితో బాధపడుతున్న వారు సాయంత్రం టీ తాగకూడదు. పొడి చర్మం, పొడి జుట్టు వంటి సమస్యలతో బాధపడేవారు కూడా దీనిని వదిలేయాలి. మలబద్ధకం, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు వంటివి ఉన్నవారు సాయంత్రం పూట టీ తాగకూడదు. నిద్రలేమితో బాధపడేవారు, ఇన్‌సోమ్నియా వంటి జబ్బులు కలవారు టీ సాయంత్రం పూట ముట్టుకోకూడదు.