చపాతీలు ఎన్ని చేయాలో లెక్కపెడుతున్నారా? బరువు తగ్గడం కోసం ఇప్పుడు ఎక్కువ మంది రాత్రిపూట చపాతీలను తినడానికే ఇష్టపడుతున్నారు. రోటీలు చేయడానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన నమ్మకాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే జీవితం సుఖంగా సాగిపోతుంది అని చెబుతున్నారు. చపాతీలు చేయడానికి ముందు ఎన్నిచేయాలో లెక్కపెట్టుకుని చేయకూడదు. అలా చేస్తే సూర్యభగవంతుడిని అవమానించినట్టు. చపాతీ పిండి మిగిలితే ఫ్రిజ్‌లో పెట్టి దాచకండి. ఇది ఇంట్లోని వ్యక్తులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్లేటులో మూడు చపాతీలు పెట్టకూడదు. అది మరణించిన వ్యక్తికి సూచన. చపాతీలు చేసేటప్పుడు మొటి చపాతీని ఆవుకు పెడితే మంచిది. ఇక చివరి రోటీని కుక్కకి పెట్టాలి. చపాతీలు ఎప్పుడూ మిగిలే విధంగా చేయాలి. సరిగ్గ లెక్కపెట్టి చేయకూడదు.