అన్వేషించండి

‘భ్రమయుగం’ తెలుగు రిలీజ్ డేట్, ‘లాల్‌సలామ్’ ఓటీటీ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

సితార చేతికి మమ్ముట్టి 'భ్రమయుగం' - తెలుగులో ఆ రోజే విడుదల
లెజెండరీ యాక్టర్, మన తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితులైన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా 'భ్రమయుగం'. ఇదొక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ ఫార్మాటులో రూపొందించారు. ఆల్రెడీ మలయాళ భాషలో విడుదలైంది. విమర్శకుల నుంచి మంచి ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణతో భారీ వసూళ్లు సాధిస్తోంది. త్వరలో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్‌ పతాకాలపై చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మించిన 'భ్రమయుగం' సినిమాను తెలుగులో ఈ నెల 23న విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

యువ దర్శకుడికి అవకాశం ఇస్తున్న బాలకృష్ణ - నానికి హిట్ ఇచ్చినోడితో?
తెలుగు చలన చిత్రసీమలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)ను దర్శకుల హీరో అంటారు. కథ నచ్చితే చాలు... కొత్త దర్శకులతో సినిమా చేయడానికి ఆయన రెడీ అంటారు. యువ దర్శకులతో పలు సినిమాలు చేసిన ఘనత ఆయన సొంతం. కేవలం మూడు సినిమాలు మాత్రమే చేసిన అనుభవం ఉన్న దర్శకుడితో ఆయన సినిమా చేయనున్నారని టాక్. 'శ్యామ్ సింగ రాయ్' డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖబర్. ఫిల్మ్ నగర్ వర్గాల కథనం ప్రకారం... ఇటీవల బాలకృష్ణను కలిసి రాహుల్ సాంకృత్యాన్ ఓ స్టోరీ ఐడియా చెప్పారట. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘యానిమల్’ను తెలుగులో తీస్తే.. ఆ హీరోయే కరెక్ట్: ఆర్జీవీ
'వ్యూహం' సినిమా ప్ర‌మోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు వివాదాస్ప‌ద డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ‌. దాంట్లో భాగంగా అంద‌రికీ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు ఆయ‌న‌. అనుకున్న‌ది అనుకున్న‌ట్లు, చెప్పాలి అనిపించింది నిర్మొహ‌మాటంగా చెప్పేస్తారు ఆర్జీవి. అలా 'యానిమ‌ల్' సినిమా గురించి ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు ఆయ‌న‌. 'యానిమ‌ల్' సినిమాలో తెలుగు హీరోగా ఎవ‌రుచేస్తే బాగుంటుందో త‌న అభిప్రాయాన్ని పంచుకున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఓటీటీలోకి 'లాల్ స‌లామ్' ఇంత తొంద‌ర‌గానా? స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్క‌డంటే?
ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ 'లాల్ స‌లామ్' సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తాప‌డింద‌నే చెప్పాలి. అనుకున్నంత ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు ఈ సినిమాకి. దీంతో ఇప్పుడు తొంద‌ర‌గానే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నార‌ట‌. ఫిబ్రవ‌రి 9న రిలీజైన ఈ సినిమా మార్చి మొద‌టి వారంలోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోందనే వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ దీని రైట్స్‌ను కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది. కాగా.. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

కలెక్షన్స్ వసూళ్లలో ‘ఈగల్’ ఢమాల్ - రవితేజను వెంటాడుతోన్న ఫ్లాప్స్, నష్టం ఎంతంటే?
ఎన్నో భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయ్యింది ర‌వితేజ న‌టించిన 'ఈగ‌ల్' సినిమా. ఫ‌ిబ్ర‌వ‌రి 9న రిలీజైన ఈ సినిమా ఆశించినంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. నిర్మాతలకుర నిరాశ మిగిల్చింది. భారీ న‌ష్టాలను తెచ్చిపెట్టింది. ర‌వితేజ కెరీర్‌లోనే ఈ సినిమా అతిపెద్ద డిజార్ట్‌గా నిలిచినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొద‌టి మూడు రోజులు క‌లెక్ష‌న్స్ కొంతమేర బాగానే ఉన్నాయి అనిపించినా.. ఆ త‌ర్వాత మాత్రం ఘోరంగా విఫ‌లమైంది 'ఈగల్'. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget