అన్వేషించండి

Lal Salaam - OTT Release: ఓటీటీలోకి 'లాల్ స‌లామ్' ఇంత తొంద‌ర‌గానా? స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్క‌డంటే?

Lal Salaam - OTT Release: త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన 'లాల్ స‌లామ్'. ఓటీటీలోకి రానుంది. మ‌రి ఈ సినిమా ఎప్పుడు? ఎక్క‌డ స్ట్రీమ్ అవుతుందంటే?

Lal Salaam - OTT Release: ఈ రోజుల్లో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని కొంత‌మంది ప్రేక్ష‌కులు వెయిట్ చేస్తుంటే.. ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని మ‌రో వ‌ర్గం ప్రేక్ష‌కులు ఎదురుచూస్తుంటారు. అయితే, సినిమా రిలీజైన నెల‌కో లేదా 40 రోజుల‌కో సినిమాలు ఓటీటీల్లోకి వస్తాయి. బాగా ఆడిన సినిమాలు అయితే.. ఇంకొంచెం లేటుగా రిలీజ్ అవుతాయి. థియేట‌ర్ల‌లో అంత‌గా ఆద‌ర‌ణ రాని సినిమాలు అనుకున్న టైం కంటే కొంచెం తొంద‌ర‌గానే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ర‌జ‌నీకాంత్ న‌టించిన 'లాల్ స‌లామ్' రిలీజ్ అయిన చాలా కొద్ది రోజుల‌కే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది అనే టాక్ గ‌ట్టిగా వినిపిస్తోంది.

స్ట్రీమింగ్ అక్క‌డే.. మార్చి మొద‌టి వారంలోనే.. 

ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ 'లాల్ స‌లామ్' సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తాప‌డింద‌నే చెప్పాలి. అనుకున్నంత ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు ఈ సినిమాకి. దీంతో ఇప్పుడు తొంద‌ర‌గానే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నార‌ట‌. ఫిబ్రవ‌రి 9న రిలీజైన ఈ సినిమా మార్చి మొద‌టి వారంలోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోందనే వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ దీని రైట్స్‌ను కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది. కాగా.. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.  

'లాల్‌సలామ్‌' చిత్రానికి ర‌జనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్‌ హీరోగా నటించారు. రజనీకాంత్‌ ఈ సినిమాలో గెస్ట్‌రోల్‌ ప్లే చేశారు. ఈ సినిమాని స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. విక్రాంత్‌, టాలీవుడ్ న‌టులు జీవిత రాజ‌శేఖ‌ర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. 'లాల్ సలాం' సినిమాలో రజనీకాంత్ తో పాటుగా క్రికెట్ లెంజెండ్ క‌పిల్ దేవ్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకుర్చారు. విష్ణు రంగస్వామీ సినిమాటోగ్రఫీ అందించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో సుభాస్కరన్ ఈ సినిమాని నిర్మించారు. అయితే, ఈ సినిమా అనుకున్నంత రీతిలో ఆడ‌లేదు. వ‌సూళ్లు కూడా పెద్ద‌గా రాలేదు. ఇక తెలుగులో అయితే, ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. చాలా థియేట‌ర్లో జ‌నాలు లేక షో లు క్యాన్సిల్ చేశారు నిర్వాహ‌కులు. ర‌జ‌నీకాంత్ సినిమాకి తెలుగులో ఇలాంటి ప‌రిస్థితి ఎదుర‌వ్వ‌డం ఇదే మొద‌టిసారి అనిచెప్తున్నారు సినీ విశ్లేష‌కులు. ఇక తెలుగులోనే కాదు.. త‌మిళంలో కూడా క‌లెక్ష‌న్లు చాలా త‌క్కువ వ‌చ్చాయి.      

ర‌జ‌నీకాంత్ సినిమాల‌కి త‌మిళంలో ఎంత క్రేజ్ ఉంటుందో.. తెలుగులో కూడా అంతేక్రేజ్ ఉంటుంది. అయితే, ఈ సినిమాకి సంబంధించి తెలుగులో ఎలాంటి ప్ర‌మోష‌న్స్ చేయ‌లేదు. చ‌డీచ‌ప్పుడు లేకుండా తెలుగులో విడుదల చేశారు. చాలామంది తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా ఒక‌టి రిలీజైందనే విష‌యం కూడా తెలీదు. యూట్యూబ్ లో కేవ‌లం 11 రోజుల క్రిత‌మే ఈ సినిమాకి సంబంధించి ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి తెలుగులో ప్ర‌మోష‌న్స్ కూడ చేయ‌లేదు. ఈ సినిమాలో జీవిత రాజ‌శేఖ‌ర్ కూడా న‌టించారు. క‌నీసం ఆమెతో ఇంటర్వ్యూలు ప్లాన్ చేసినా జ‌నాలు థియేట‌ర్ల‌కు వెళ్లేవారేమో అని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Also Read: కలెక్షన్స్ వసూళ్లలో ‘ఈగల్’ ఢమాల్ - రవితేజను వెంటాడుతోన్న ఫ్లాప్స్, నష్టం ఎంతంటే?

టాప్ హెడ్ లైన్స్

Sunday OTT Movies : ఆదివారం ఓటీటీల్లో సినిమాల సందడి - వీకెండ్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్... 150 కోట్ల మూవీ డోంట్ మిస్
ఆదివారం ఓటీటీల్లో సినిమాల సందడి - వీకెండ్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్... 150 కోట్ల మూవీ డోంట్ మిస్
Least Eligible Bachelor Review - 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రివ్యూ: రెండు ఓటీటీల్లో 'జబర్దస్త్' బాబు కామెడీ సిరీస్ - హీరోగా హర్ష చెముడు ఏం చేశారంటే?
'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రివ్యూ: హీరోగా హర్ష చెముడు... కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
Romantic Action Thriller OTT : చిన్నారుల కిడ్నాప్... మాఫియాను ఎలా పట్టుకున్నారు? - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్
చిన్నారుల కిడ్నాప్... మాఫియాను ఎలా పట్టుకున్నారు? - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget