అన్వేషించండి

Ravi Teja - Eagle: కలెక్షన్స్ వసూళ్లలో ‘ఈగల్’ ఢమాల్ - రవితేజను వెంటాడుతోన్న ఫ్లాప్స్, నష్టం ఎంతంటే?

Ravi Teja - Eagle: ఎన్నో భారీ అంచ‌నాల‌తో రిలీజ్ అయ్యింది 'ఈగ‌ల్' సినిమా. ర‌వితేజ న‌టించిన ఈ సినిమా ఆయ‌న కెరీర్ లోనే భారీ డిజాస్ట‌ర్ గా నిలిచింది. నిర్మాత‌ల‌కు న‌ష్టాన్ని మిగిల్చింది.

Ravi Teja - Eagle Big Disaster: ఎన్నో భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయ్యింది ర‌వితేజ న‌టించిన 'ఈగ‌ల్' సినిమా. ఫ‌ిబ్ర‌వ‌రి 9న రిలీజైన ఈ సినిమా ఆశించినంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. నిర్మాతలకుర నిరాశ మిగిల్చింది. భారీ న‌ష్టాలను తెచ్చిపెట్టింది. ర‌వితేజ కెరీర్‌లోనే ఈ సినిమా అతిపెద్ద డిజార్ట్‌గా నిలిచినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొద‌టి మూడు రోజులు క‌లెక్ష‌న్స్ కొంతమేర బాగానే ఉన్నాయి అనిపించినా.. ఆ త‌ర్వాత మాత్రం ఘోరంగా విఫ‌లమైంది 'ఈగల్'. 

భారీ ఫ్లాప్.. 

మాస్ మహారాజా రవితేజ.. చాలాకాలం తర్వాత ‘ఈగల్’తో కమ్ బ్యాక్ ఇచ్చాడని ఫ్యాన్స్ సంతోషించారు. ఫిబ్రవరీ 9న విడుదలైన ఈ చిత్రం మొదటిరోజు పాజిటివ్ టాక్‌ అందుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. టీజర్, ట్రైలర్ నుండే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసింది. అయితే, ఆ త‌ర్వాత మాత్రం ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌లేక‌పోయింది. దీంతో ఈ సినిమా ర‌వితేజ కెరీర్ లోనే బిగెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. 'టైగ‌ర్ నాగేశ్వర‌రావు' సినిమా కంటే కూడా ఇది భారీ డిజాస్ట‌ర్ అని విశ్లేష‌కులు చెప్తున్నారు. ఇక హిందీలో కూడా రిలీజైన ఈ సినిమా అక్కడి ప్రేక్ష‌కుల‌ను కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేకపోయింది. 

నిర్మాత‌ల‌కు న‌ష్టాలు.. 

చాలా ప్రాంతాల్లో ‘ఈగల్’కు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ విషయంలో మాత్రం వీక్ అయ్యింది. బ్రేక్ ఈవెన్ కూడా ద‌క్క‌లేదు. ఇక ఈ సినిమా నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మాణ సంస్థ‌కి న‌ష్టాలే వ‌చ్చాయి. దాదాపు రూ.25 కోట్లు న‌ష్టాలు వ‌చ్చిన‌ట్లు లెక్క‌లు చెప్తున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ర‌వితేజతో వ‌రుస సినిమాలు చేస్తుండ‌గా.. 'ధమాకా' సినిమా మాత్రమే స‌క్సెస్ అయ్యింది. 

మూడురోజుల్లో ఎంతంటే..?

మొదటిరోజు ‘ఈగల్’.. దేశవ్యాప్తంగా రూ. 6.2 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక రెండోరోజు దాదాపు రూ.5 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో రెండు రోజుల్లోనే ‘ఈగల్’ కలెక్షన్స్.. రూ.10 కోట్ల మార్క్‌ను టచ్ చేశాయి. మొదటి రోజులాగానే రెండోరోజు కూడా ఈ సినిమా వసూళ్లు నిలకడగా ఉన్నాయి. ఇక మూడో రోజు కలెక్షన్స్ మాత్రం తగ్గాయి. మూడోరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ‘ఈగల్’.. రూ. 3 కోట్ల షేర్ సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా మూడోరోజు ‘ఈగల్’ కలెక్షన్స్ రూ.3.40 కోట్ల మార్క్‌ను టచ్ చేశాయి. విడుద‌లైన మూడు రోజుల్లో ‘ఈగల్’.. రూ.11.50 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇక ఆ త‌ర్వాత మాత్రం క‌లెక్ష‌న్లు భారీగా త‌గ్గినట్లు తెలుస్తోంది. 

‘ఈగల్’లో రవితేజకు జోడీగా కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ నటించారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా ఈ సినిమాను నిర్మించారు. నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల త‌దిత‌రులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకి కార్తిక్ ఘట్టమనేని దర్శకుడిగా చేశారు. ‘సూర్య వర్సెస్ సూర్య’ అనే సినిమాతో సినిమాటోగ్రాఫర్ నుండి డైరెక్టర్‌గా మారాడు కార్తిక్. కానీ ఆ సినిమా.. తనకు ఆశించినంత విజయాన్ని, గుర్తింపును తెచ్చిపెట్టలేకపోయింది. ఇక ఇప్పుడు ఈగల్ కూడా నిరాశ‌నే మిగిల్చింది.

Also Read: వయసు పెరిగేకొద్ది సూపర్​హాట్​గా తయారైతున్న అనుపమవయసు పెరిగేకొద్ది సూపర్​హాట్​గా తయారైతున్న అనుపమ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget