Miss You OTT Release Date : సైలెంట్ గా ఓటీటీలోకి సిద్ధార్థ్ 'మిస్ యూ'... ఈరోజు రాత్రి నుంచే స్ట్రీమింగ్ ?
Miss You OTT Streaming Platform Date: సిద్ధార్థ్ హీరోగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'మిస్ యూ' ఈ రోజు రాత్రి నుంచే సైలెంట్ గా ఓటీటీలోకి రాబోతోందని తెలుసా?
హీరో సిద్ధార్థ్ 2023లో 'చిన్నా' సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో సరైన హిట్ లేక సతమతమవుతున్న సిద్ధార్థ్ ఏడాదికి ఒక సినిమాతో మాత్రమే ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది 'మిస్ యూ' అనే మూవీతో సిద్ధార్థ్ థియేటర్లలోకి వచ్చాడు. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. తాజా బజ్ ప్రకారం 'మిస్ యూ' మూవీ ఈరోజు రాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
ఈరోజు (జనవరి 9) రాత్రే 'మిస్ యూ' స్ట్రీమింగ్...
ఇటీవల కాలంలో వరుస పరాజయాలు అందుకుంటున్న సిద్ధార్థ్ 'చిన్నా' మూవీతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. అదే జోష్ తో 'మిస్ యూ' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తో గత ఏడాది ప్రేక్షకులను పలకరించాడు. సిద్ధార్థ్ హీరోగా, ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు రాజశేఖర్ దర్శకత్వం వహించారు. 'మిస్ యూ' మూవీని సెవెన్ మైల్స్ పర్ సెకండ్ బ్యానర్ పై సామ్యూల్ మాథ్యూ నిర్మించారు. జిబ్రాన్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ అయింది. మంచి బజ్ తో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను మాత్రం థియేటర్లలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని, రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి చివరి వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోందని గత కొంతకాలంగా రూమర్లు నడుస్తున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఈరోజు రాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. కానీ ఈ విషయంపై ఇంకా అఫిషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
Also Read: 'గేమ్ చేంజర్' విడుదల తర్వాతే... కమల్ 'ఇండియన్ 3' రిలీజ్, రూమర్స్ మీద శంకర్ అప్డేట్
భారీ డిజాస్టర్ 'మిస్ యూ'
నిజానికి 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 'మిస్ యూ' సినిమా కనీసం పెట్టిన బడ్జెట్ లో సగం కలెక్షన్లను కూడా రాబట్ట లేకపోయింది. సినిమాలో యూత్ ఫుల్ కంటెంట్, కామెడీ అంశాల మేళవింపు ఉన్నప్పటికీ రొటీన్ స్టోరీ కావడంతో బెడిసికొట్టింది. ఈ మూవీతో మరోసారి సిద్ధార్థ్ ఖాతాలో డిజాస్టర్ పడింది. ప్రమాదంలో మెమొరీలో లాస్ అయిన ఓ వ్యక్తి జీవితంలో జరిగే లవ్ స్టోరీ చుట్టూ ఈ మూవీ నడుస్తుంది.
రిలీజ్ కి ముందే వివాదాలు...
'మిస్ యూ' మూవీ ప్రమోషన్లలో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. పాట్నాలో జరిగిన 'పుష్ప 2' ఈవెంట్ కు లక్షల్లో జనాలు రావడంపై ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. సినిమాకు, దాని ప్రచార ఈవెంట్లకు జనాలు రావడానికి పెద్దగా సంబంధం లేదని, ఏ పని జరుగుతున్నా సరే జనాలు చూడడానికి వస్తారని సిద్ధార్థ్ అన్నారు. ఆ తరువాత ఇంటర్వ్యూలో ఈ వివాదం గురించి ప్రస్తావిస్తూ "అల్లు అర్జున్ తో మీకు ఏదైనా సమస్య ఉందా?" అని ప్రశ్నించగా, తనకు ఎవరితోనో ఎలాంటి సమస్యలు లేవని, 'పుష్ప 2' సక్సెస్ కావడం సంతోషంగా ఉందని ఆ వివాదానికి సిద్ధార్థ్ ఫుల్ స్టాప్ పెట్టారు.