సిద్ధార్థ్‌తో ఎంగేజ్‌మెంట్ తర్వాత అదితి మీద అందరి చూపు పడింది. ఆమె ఆస్తుల విలువ ఎంత? సిద్ధూకు వచ్చే కట్నం ఎంత? అదితి రావు హైదరి ఒక్కో సినిమాకు కోటి రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని ఫిల్మ్ నగర్ టాక్. యాడ్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా నెలకు అదితి రావు హైదరి 50 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారట. ఇన్‌స్టాగ్రామ్‌లో అదితి రావు హైదరికి 10 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ఒక్కో పోస్టుకు 50 వేలు నుంచి లక్ష ఛార్జ్ చేస్తారట. అదితి రావు హైదరి ఆస్తుల విలువ 2022 లెక్కల ప్రకారం 65 కోట్ల రూపాయలు అని టాక్. అదితి ఆస్తుల విలువ 2022 నుంచి ఇప్పటికి ఐదారు కోట్లు పెరిగి ఉండొచ్చని ఫిల్మ్ నగర్ టాక్. అదితి రావు హైదరిని పెళ్లి చేసుకోవడం వల్ల సిద్ధార్థ్‌కు అటు ఇటుగా రూ. 70 కోట్లు వస్తాయి. అదితి రావు హైదరి వనపర్తి సంస్థాన వారసురాలు కావడంతో సిద్ధార్థ్‌కు ఆ గౌరవం కూడా వస్తుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ సినిమాలు & వెబ్ సిరీస్‌లలో అదితి రావు హైదరి నటిస్తూ బిజీగా ఉన్నారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న వెబ్ సిరీస్ 'హీరామండీ'తో త్వరలో వీక్షకుల ముందుకు రానున్నారు అదితి. అదితి రావు హైదరి (all images courtesy: aditiraohydari / Instagram)