![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mahaan Telugu Teaser: 'మనం పెట్టిందే చట్టం.. మనం పోసేదే మద్యం'.. 'మహాన్' తెలుగు టీజర్ చూశారా..?
విక్రమ్, ధృవ్ నటించిన 'మహాన్' సినిమా టీజర్ ను విడుదల చేశారు.
![Mahaan Telugu Teaser: 'మనం పెట్టిందే చట్టం.. మనం పోసేదే మద్యం'.. 'మహాన్' తెలుగు టీజర్ చూశారా..? Mahaan Telugu teaser: Vikram’s film to tell story of rise and fall of a liquor baron Mahaan Telugu Teaser: 'మనం పెట్టిందే చట్టం.. మనం పోసేదే మద్యం'.. 'మహాన్' తెలుగు టీజర్ చూశారా..?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/01/9e0389f83f5bb81b113d4fce56c209c5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తెలుగులో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆయన సినిమాలన్నీ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలేవీ సరైన సక్సెస్ ను అందుకోలేకపోయాయి. దీంతో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో టాలెంటెడ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ తో కలిసి 'మహాన్' అనే సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమాలో విక్రమ్ తో పాటు ఆయన కుమారుడు ధృవ్ కూడా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఈ సినిమా తెలుగు టీజర్ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో విక్రమ్.. గాంధీ మహాన్ అనే పాత్రలో కనిపించనున్నారు. నాటు సారాను నిషేదించాలని పోరాడే ఓ వ్యక్తి తన కొడుకుని(విక్రమ్) మధ్య నిషేద పోరాట వీరుడుగా చూడాలనుకుంటాడు. కానీ అతడు మాత్రం పెద్దయిన తరువాత బార్ సిండికేట్ ను నడిపిస్తుంటాడు. ఆ తరువాత ఏం జరిగిందనేదే స్టోరీ.
డబ్బు, మందు, గొడవలు వంటి సన్నివేశాలను టీజర్ లో చూపించారు. 'ఏపీలో ఎవడు బార్ని లీజుకు తీసుకున్నా సరే వాడు మన సిండికేట్ మనిషై ఉండాలి. మనం పెట్టిందే చట్టం.. మనం పోసేదే మద్యం' అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. టీజర్ చివర్లో ధృవ్ ను సైడ్ నుంచి చూపించారు. టీజర్ అయితే చాలా ఇంటెన్స్ గా కట్ చేశారు. మరి ఈ సినిమాతో విక్రమ్ అండ్ ధృవ్ ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.
ఇక ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తిక్ సుబ్బరాజ్ చివరిగా డైరెక్ట్ చేసిన 'జగమే తంత్రం' సినిమా కూడా ఓటీటీలోనే విడుదలైంది. ఇప్పుడు 'మహాన్' కూడా ఓటీటీకే వెళ్తుంది. ఈ సినిమాలో సిమ్రన్, బాబీసింహా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)