అన్వేషించండి

HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం

China Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదైన వేళ ఆందోళన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ వైరస్ 2001లోనే గుర్తించారని.. అయినా అప్రమత్తంగానే ఉన్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు.

Central Government Key Announcement On HMPV Virus Cases: చైనాలో హెచ్ఎంపీవీ (HMPV) వైరస్ కేసులు కలవరపెడుతోన్న వేళ భారత్‌లోనూ ఈ కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటకలోని బెంగుళూరులో 2, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 1, కోల్‌కతాలో 1, చెన్నైలో 2 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా చిన్నారులకు ఈ వైరస్ సోకగా వారికి ఎవరికీ ట్రావెల్ హిస్టరీ లేదు. వీరికి ఎలా సోకిందనే దానిపై వైద్య నిపుణులు ఆరా తీస్తున్నారు. చిన్నారులను ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, హ్యుమన్ మెటానిమోవైరస్ (HMPV) వ్యాప్తిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్రం స్పష్టం చేసింది. 

జేపీ నడ్డా కీలక ప్రకటన

HMPV వైరస్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda) కీలక ప్రకటన చేశారు. దీనిపై అప్రమత్తంగా ఉన్నామని.. ఈ వైరస్ కొత్తది కాదని.. 2001లోనే గుర్తించినట్లు వెల్లడించారు. అయినప్పటికీ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని.. పొరుగుదేశాల్లో ముఖ్యంగా చైనాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. ఇది మిగతా శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే ఉంటుందని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. దేశంలో ఇన్‌ఫ్లుయెంజా మాదిరి వ్యాధులు (ILI) లేదా తీవ్ర శ్వాసకోశ వ్యాధులు (SARI) అసాధారణ రీతిలో ఏమీ లేదని తెలిపారు.

హెచ్ఎంపీవీ ఇతర శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే ఉంటుందని.. సాధారణ జలుబు, ఫ్లూ మాదిరి లక్షణాలు కనిపిస్తాయని కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ డాక్టర్ అతుల్ గోయల్ తెలిపారు. చిన్నారులు, వృద్ధుల్లో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తుందని.. సీజనల్ శ్వాసకోశ సంబంధిత కేసులను ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య సామగ్రి, పడకలు, ఇతర వసతులతో భారత్‌లోని ఆస్పత్రులు సంసిద్ధంగా ఉన్నాయన్నారు. శీతాకాలంలో అవసరమైన జాగ్రత్తలు వహించడం సహా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సాధారణ వైరస్..!

హ్యుమన్ మెటానిమోవైరస్ (HMPV).. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో సంభవించే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో 12 శాతం వరకూ ఇదే కారణమవుతోందని అంచనా. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV)ను పోలి ఉండే ఈ వైరస్.. ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే కనిపిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా 11 ఏళ్ల చిన్నారుల్లోనే ఎక్కువగా ఇది కనిపిస్తుండగా.. తొలిసారిగా దీన్ని 2001లో నెదర్లాండ్స్‌లో 28 మంది చిన్నారుల్లో గుర్తించారు.

మరోవైపు, బెంగుళూరులో ఇద్దరు చిన్నారులకు వైరస్ సోకడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇది కొవిడ్ వైరస్‌లా వ్యాప్తి చెందేది కాదని.. అందువల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని విజ్ఞప్తి చేసింది. ఎవరైనా దగ్గు, తుమ్మిన సమయంలో నోరు, ముక్కు కప్పి ఉంచుకోవాలని.. తరచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించింది. వాడిన టిష్యూ పేపర్లు తిరిగి ఉపయోగించొద్దని.. రుమాలు, తువ్వాలు షేర్ చేసుకోవద్దని పేర్కొంది. వైరస్ లక్షణాలు ఉన్న వారు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.

Also Read: Chhattisgarh Blast: ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
రాహుల్ గాంధీకి నవంబర్ 2026 కీలకం: జ్యోతిష్య అంచనాలు, రాజకీయ మలుపులు!
రాహుల్ గాంధీకి నవంబర్ 2026 కీలకం: జ్యోతిష్య అంచనాలు, రాజకీయ మలుపులు!
AIADMK MLAs Case: ఎమ్మెల్యేల రాజీనామాలు, పార్టీ మార్పుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడం రాజకీయ ప్రక్రియే!
ఎమ్మెల్యేల రాజీనామాలు, పార్టీ మార్పుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడం రాజకీయ ప్రక్రియే!
Rahul Gandhi Convoy Accident: రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
BJP Jana Sena Telangana: ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
Cyclone Arnab Relief Number: అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు
అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు అందుబాటులోకి
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
రూ.10 లక్షలకే Hyundai Bayon లాంచ్‌ - ఈ కారు మీ మాట వింటుంది.. 12.3-ఇంచ్ డిస్‌ప్లేలు, పానోరమిక్ సన్‌రూఫ్ కూడా!
Hyundai Bayon SUV లాంచ్.. Creta కంటే ధర తక్కువే, ఫీచర్లు మాత్రం అదుర్స్!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Embed widget