అన్వేషించండి

Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు

SCR: సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ద.మ రైల్వే 6 ప్రత్యేక సర్వీసులను నడపనుంది. కాచిగూడ, చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్ స్టేషన్ల మధ్య ఈ రైళ్లు సేవలందించనున్నాయి.

SCR Special Trains To Srikakulam For Sankranthi Rush: సంక్రాంతి అంటేనే తెలుగు వారికి పెద్ద పండుగ. ఈ క్రమంలో ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఆ 3 రోజుల వేడుక కోసం స్వగ్రామాలకు తరలివస్తుంటారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోనసీమ జిల్లాల్లో సంక్రాంతి సందడే వేరు. ఈ క్రమంలో ఈ ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ప్రకటించిన ద.మ రైల్వే (South Central Railway) శ్రీకాకుళానికి మరిన్ని ప్రత్యేక సర్వీసులను (Special Trains) నడపనున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీసులు కాచిగూడ/చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్ స్టేషన్ల మధ్య నడవనున్నాయి. ఈ నెల 11, 12, 15, 16 తేదీల్లో కాచిగూడ - శ్రీకాకుళం రోడ్ మధ్య.. ఈ నెల 8, 9 తేదీల్లో చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ మధ్య 2 రైళ్లు నడవనున్నాయి.

పూర్తి వివరాలివే..

  • ఈ నెల 11, 15 తేదీల్లో కాచిగూడ - శ్రీకాకుళం రోడ్ (07615) రైలు కాచిగూడ నుంచి సాయంత్రం 5:45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. అలాగే, 12, 16 తేదీల్లో శ్రీకాకుళం రోడ్ నుంచి మధ్యాహ్నం 2:45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7:35 గంటలకు కాచిగూడ చేరుకోనుంది. ఈ రైలు మల్కాజిగిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, పొందూరు స్టేషన్లలో ఆగనుంది. ఈ రైలు బోగీలన్నీ థర్డ్ ఏసీ కోచ్‌లే అని అధికారులు వెల్లడించారు.
  • చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైలు (07617) ఈ నెల 8న చర్లపల్లిలో రాత్రి 7:20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకుంటుంది. అలాగే, శ్రీకాకుళం రోడ్ - చర్లపల్లి (07168) రైలు.. ఈ నెల 9న మధ్యాహ్నం 2:45 గంటలకు శ్రీకాకుళంలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ కోచ్‌లు ఉంటాయని ద.మ రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు.
  • ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగనుంది.

52 అదనపు సర్వీసులు

పండుగ రద్దీ దృష్ట్యా ఇప్పటికే 52 అదనపు సర్వీసులు నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. నగరంలోని సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకూ ఆయా ప్రాంతాలకు ఇవి అందుబాటులో ఉంటాయని చెప్పారు. జనవరి 6, 7 తేదీల్లో చర్లపల్లి - తిరుపతి - చర్లపల్లి (రైలు నెం: 07077/07078), ఈ నెల 8, 9, 11, 12, 15, 16 తేదీల్లో చర్లపల్లి - తిరుపతి - చర్లపల్లి (02764/02763) మొత్తం 6 సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో కాచిగూడ - శ్రీకాకుళం రోడ్ - కాచిగూడ (07041/07042) రైళ్లు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read: Voters List: సవరించిన ఓటర్ల జాబితా రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం - తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లు ఎంతమందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind Vs Aus Semi Final Live Score Update: ఆసీస్ డీసెంట్ స్కోరు.. స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భార‌త్ ముందు ఊరించే టార్గెట్
ఆసీస్ డీసెంట్ స్కోరు.. స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భార‌త్ ముందు ఊరించే టార్గెట్
Ravindra Jadeja Plaster: జడేజా చేతికి ప్లాస్టర్.. అంపైర్ కీలక నిర్ణయం.. షాక్ లో నెటిజన్లు
జడేజా చేతికి ప్లాస్టర్.. అంపైర్ కీలక నిర్ణయం.. షాక్ లో నెటిజన్లు
PM Modi Visits Vantara: సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
RS Praveen Kumar: తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs Aus Semi final Preview | Champions Trophy 2025 లోనైనా ఆసీస్ ఆ రికార్డు బద్ధలు అవుతుందా | ABPTravis Head vs India | హెడ్ మాస్టర్ ని ఆపగలిగితే Champions Trophy 2025 ఫైనల్ కి మనమే | ABP DesamInd vs Aus Semis 1 Preview | Champions Trophy 2025 లో కంగారూలను టీమిండియా కుమ్మేస్తుందా.? | ABPOscar 2025 | 97వ ఆస్కార్‌ అవార్డుల్లో చరిత్ర సృష్టించిన అనోరా సినిమా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind Vs Aus Semi Final Live Score Update: ఆసీస్ డీసెంట్ స్కోరు.. స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భార‌త్ ముందు ఊరించే టార్గెట్
ఆసీస్ డీసెంట్ స్కోరు.. స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భార‌త్ ముందు ఊరించే టార్గెట్
Ravindra Jadeja Plaster: జడేజా చేతికి ప్లాస్టర్.. అంపైర్ కీలక నిర్ణయం.. షాక్ లో నెటిజన్లు
జడేజా చేతికి ప్లాస్టర్.. అంపైర్ కీలక నిర్ణయం.. షాక్ లో నెటిజన్లు
PM Modi Visits Vantara: సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
RS Praveen Kumar: తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
  ఇద్దరు పిల్లలు వద్దు....గంపెడు పిల్లలే ముద్దు.  తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపు.
  ఇద్దరు పిల్లలు వద్దు....గంపెడు పిల్లలే ముద్దు.  తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపు.
SSMB29: రాజమౌళి, మహేశ్ మూవీలో 'ప్రియాంక చోప్రా' - ఆమె మదర్ ఏం చెప్పారంటే?
రాజమౌళి, మహేశ్ మూవీలో 'ప్రియాంక చోప్రా' - ఆమె మదర్ ఏం చెప్పారంటే?
Andhra MLC Elections: కలసి ఉంటే కలదు విజయం -ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని కూటమి - కళ్లు తిరిగే మెజార్టీలు
కలసి ఉంటే కలదు విజయం -ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని కూటమి - కళ్లు తిరిగే మెజార్టీలు
Ind Vs Aus Semis Rohit Comments: టాస్ ఓడ‌ట‌మే మంచిదైంది..!  బ్యాటింగ్, బౌలింగ్ లో ఏం చేయాలో అర్థం కాలేదు..:!! రోహిత్ వ్యాఖ్య‌
టాస్ ఓడ‌ట‌మే మంచిదైంది..!  బ్యాటింగ్, బౌలింగ్ లో ఏం చేయాలో అర్థం కాలేదు..:!! రోహిత్ వ్యాఖ్య‌
Embed widget