Pushpa Actor Shritej: మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో "పుష్ప" నటుడు శ్రీతేజ్ మీద బాంబు పేల్చిన భార్య
టాలీవుడ్ నటుడు శ్రీ తేజ్ పై తాజాగా ఓ యువతి మోసం చేశాడంటూ పోలీసులకు కంప్లయింట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన భార్య కూడా ఇలాగే శ్రీతేజ్ పై సంచలన ఆరోపణలు చేసింది.

ప్రముఖ నటుడు శ్రీతేజ్ పై ఈరోజు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. పెళ్లి పేరుతో నమ్మించి, మోసం చేశాడంటూ ఓ యువతి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా, కూకట్ పల్లిలో జీరో ఎఫ్ఐఆర్ పేరుతో కేసును నమోదు చేశారు. "పుష్ప 2" వంటి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న ఈ యాక్టర్ మోసం చేశాడనే వార్త ఓ వైపు సంచలనం సృష్టిస్తుండగా, మరోవైపు ఆయన భార్య తనను కూడా మోసం చేశాడంటూ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.
ఓ యువతి తనను ప్రేమ, పెళ్లి పేరుతో నటుడు శ్రీ తేజ్ మోసం చేశాదంటూ ఈరోజు కంప్లైంట్ చేయగా, కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో బిఎన్ఎస్ 69, 115 (2), 318(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలోనూ బాధితురాలు కూకట్ పల్లి పోలిస్ స్టేషన్ లో ఆయనపై ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. కంప్లైంట్ లో సదరు యువతి ప్రేమ, పెళ్లి పేరుతో తనను లొంగ తీసుకొని, తన దగ్గర నుంచి 20 లక్షలు కాజేసాడని పేర్కొంది. అలాగే పెళ్లయిన మరో వివాహితతో శ్రీతేజ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఆమె ఓ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భార్య అనే విషయం బయటకు వచ్చింది. ఎఫైర్ విషయం తెలిసిన అతను గుండెపోటుతో మరణించాడని, పెళ్ళయిన మహిళను ట్రాప్ చేసిన విషయంపై కూడా ఇప్పటికే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో శ్రీతేజ్ పై కంప్లైంట్ ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కేసులో శ్రీతేజ్ భార్య ఎంట్రీ ఇవ్వడంతో మరో ట్విస్ట్ నెలకొంది.
Also Read: టార్గెట్ రాజమౌళి, ప్రశాంత్ నీల్... యాక్షన్ ఎపిసోడ్స్ ఇరగదీసిన సుకుమార్ - జాతరకు పూనకాలే
ఈ కేసు విషయం బయటకు వచ్చిన వెంటనే శ్రీ తేజ్ భార్య నితిషా అతనిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. 2025లో తనకు శ్రీ తేజ్ తో పెళ్లి జరిగిందని, 25 లక్షలు కట్నంగా ఇచ్చి తనకు తల్లిదండ్రులు ఘనంగా పెళ్లి చేశారని నితిషా చెప్పుకొచ్చింది. అయితే పెళ్లయ్యాక శ్రీ తేజ్ తనను విజయవాడలోనే ఉంచాడని, హైదరాబాద్ తీసుకెళ్ళమని అడిగితే తీసుకెళ్లకుండా వేధించాడని ఆవేదనను వ్యక్తం చేసింది. అంతే కాకుండా హైదరాబాద్ కు తీసుకెళ్ళమని అడిగినందుకే అతని ఎఫైర్లు బయట పడతాయనే ఉద్దేశంతో విచక్షణ రహితంగా దాడి చేశాడని సంచలన ఆరోపణలు చేసింది. అలాగే హైదరాబాద్లో ఉంటూ అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని, శ్రీ తేజ రూమ్ లో ఎప్పుడూ అమ్మాయిల బట్టలు, వస్తువులు ఉండేవని గుర్తు చేసుకుంది. ఇదే విషయాన్ని అతడి దగ్గర ప్రస్తావిస్తే... అవి ప్రొడక్షన్ కి ఇవ్వాల్సిన వస్తువులు అని చెప్పి తప్పించుకునేవాడని నితిషా వెల్లడించింది.
తాను విడాకులు కోరుతూ విజయవాడ కోర్టును ఆశ్రయించానని, కానీ అతను కోర్టుకు కూడా హాజరు కాలేదని, మరోవైపు మెయింటెనెన్స్ ఇవ్వకుండా వేధిస్తున్నాడని తన బాధను వెళ్లగక్కింది నితిషా. ఈ ఆరోపణలపై ఇప్పటిదాకా శ్రీ తేజ్ స్పందించలేదు. మరోవైపు ఆయన కీలక పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ "పుష్ప 2" రిలీజ్ కు సిద్ధం అవుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

