Kannappa Release Date : "కన్నప్ప" రిలీజ్ డేట్ అఫిషియల్ అనౌన్స్మెంట్.. సమ్మర్ హాలీడేస్ పై కన్నేసిన మంచు విష్ణు
"కన్నప్ప" రిలీజ్ డేట్ అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. సమ్మర్ కానుకగా సినిమాను రిలీజ్ చేయబోతున్నాం అని ప్రకటించారు మంచు విష్ణు.
మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ "కన్నప్ప" రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా స్వయంగా మంచు విష్ణు "కన్నప్ప" విడుదల తేదీని స్పెషల్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.
టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా రూపొందుతోంది "కన్నప్ప" మూవీ. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు కీలక పాత్రను పోషిస్తున్నారు. మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మధుబాల, శరత్ కుమార్, ముఖేష్ రిషి, దేవరాజ్, ఐశ్వర్య భాస్కరన్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రభాస్ కూడా ఈ మూవీలో కీలకపాత్రను పోషించబోతున్నారు. "కన్నప్ప" మూవీని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్, అవా ఎంటర్టైన్మెంట్స్ పై మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని 'భక్త కన్నప్ప' చరిత్రలను స్ఫూర్తిగా తీసుకొని ఈ "కన్నప్ప" సినిమాను తెరకెక్కిస్తున్నారు.
"కన్నప్ప"లో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా, ప్రభాస్ నంది పాత్రలో కనిపించబోతున్నారు. అక్షయ్ కుమార్ మహా శివుడిగా దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ సినిమాతోనే మంచు వఈషను తనయుడు అవ్రామ్ చిత్ర పరిశ్రమంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అతను బాల తిన్నడు అనే పాత్రలో కన్పించబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంచు విష్ణు "కన్నప్ప" మూవీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. వేసవి కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ 25న "కన్నప్ప" మూవీని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టుగా వెల్లడించారు. 'పరమేశ్వరుడి గొప్ప భక్తుడి కథ తెలుసుకోవడానికి సిద్ధం కండి' అంటూ సినిమా రిలీజ్ డేట్ ను స్పెషల్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు.
#HarHarMahadevॐ #Kannappa🏹 pic.twitter.com/qGFxAOKp14
— Vishnu Manchu (@iVishnuManchu) November 25, 2024
ఇక రీసెంట్ గా మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పాత్రను రివీల్ చేశారు. ఈ సినిమాలో మోహన్ బాబు మహదేవ శాస్త్రి అనే పాత్రను పోషిస్తున్నారు. సినిమాలో మోహన్ బాబు పాత్ర చాలా గంభీరంగా ఉండబోతుందని పోస్టర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో రిలీజ్ చేశారు. దీంతో ఇప్పటికే సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇక గత కొన్ని రోజుల నుంచి మేకర్స్ సినిమాలోని సపోర్టింగ్ క్యారెక్టర్లకు సంబంధించిన ఒక్కో పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. ఈ సినిమా ఏప్రిల్ ఎండింగ్ లో రిలీజ్ కాబోతోంది. అంటే స్కూల్స్ కు సెలవులు వచ్చే టైమ్ అన్నమాట. మొత్తానికి "కన్నప్ప" వేసవి సెలవులను క్యాష్ చేసుకునే ప్లాన్ వేయడం కలిసొచ్చే అంశం అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా మంచు ఫ్యామిలీతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మైలురాయి అవుతుందని నమ్ముతున్నారు మంచు విష్ణు.