KCR Met BRS Leaders: ఎర్రవల్లి ఫాం హౌస్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశం, వరంగల్ సభపై దిశానిర్దేశం
BRS Silver Jubilee Celebrations | బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు వరంగల్ లో ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ ప్లాన్ చేశారు.

BRS Warangal Meeting | సిద్దిపేట: ఈ నెలలో భారత రాష్ట్ర సమితి (BRS) 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పార్టీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్లకు కసరత్తు మొదలుపెట్టింది. గత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నేతలతో భేటీ అవుతున్నారు. ఇటీవల తెలంగాణ భవన్‌లో పార్టీ కీలక నేతలతో సమావేశమై అసెంబ్లీలో పార్టీ వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. తాజాగా సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉమ్మడి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు చెందిన BRS నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు.
కేటీఆర్ తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా కీలక నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 27న వరంగల్ లో నిర్వహించనున్న BRS పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలను కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని గులాబీ నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఒక్క నియోజకవర్గం నుంచి లక్ష మందికి తగ్గకుండా లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేలా ప్లాన్ ఉండాలని బీఆర్ఎస్ అధినేత పార్టీ నేతలకు సూచించారు. ఫాం హౌజ్‌కు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజా ప్రతినిధులతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు.
ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనతో తెలంగాణలో అన్ని వర్గాల వారు మోసపోయారని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు సూచించారు. తులం బంగారం లేదు అసలు కళ్యాణలక్ష్మీ, షాదీ ముఖారక్ ఉందా అనే అనే పరిస్థితి నెలకొంది. రైతులకు రైతు బంధు లేదు, రైత భరోసా లేదని.. వారి పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మీద ఉందన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఏడాదిన్నర ముగిసినా నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం లేదని చర్చించారు. ఎన్నికల హామీల నెరవేర్చడం, ఏయో వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందో ఆ విషయాలను స్థానికంగా నేతలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని దిశా నిర్దేశం చేస్తున్నారు.






















