Save HCU: 'అందరూ గొంతు కలపండి' - HCU కి మద్దతుగా రష్మీ గౌతమ్
Save HCU: కంచ గచ్చిబౌలి భూముల కోసం పోరాడుతున్న HCU విద్యార్థులకు బయట నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పుడు ఆ భూములను కాపాడండి అంటూ చెబుతున్న సెలబ్రిటీల జాబితాలో యాంకర్ రష్మీ కూడా చేరింది.

HCU Protest: హైదరాబాద్ గచ్చిబౌలిలోని 400 ఎకరాల పచ్చని భూమిని కాపాడాలంటూ కొన్ని రోజులుగా ఆందోళన జరుగుతోంది. కంచ గచ్చిబౌలిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ లోపల ఉన్న ఈ భూములను అభివృద్ధి పేరట ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అయితే పచ్చదనం, వన్య ప్రాణులు ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ది పేరిట నాశనం చేయొద్దంటూ కొన్ని రోజులుగా విద్యార్థులు, వివిధ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ ఆదివారం రాాత్రి క్యాంపస్‌లో భూమిని చదును చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు పెద్ద గొడవే జరిగింది. ఆందోళన చేసిన విద్యార్థులను అరెస్ట్ చేశారు. ప్రభుత్వం ప్రొక్లెయిన్లతో చెట్లను తొలగిస్తున్నప్పుడు.. కొన్ని పక్షులు అరుస్తున్నట్లుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని షేర్ చేస్తూ ఈ భూమిని పరిరక్షించాలని కొంతమంది సెలబ్రిటీలు కూడా కోరుతున్నారు. ఇప్పుడు యాంకర్ రష్మీ కూడా అదే డిమాండ్ చేసింది.
వీడియో విడుదల చేసిన రష్మి
యాంకర్, నటి రష్మి గౌతమ్ తన ఇన్ స్టాలో ఓ వీడియోను విడుదల చేసింది, అందులో ఆమె ప్రభుత్వాన్ని హెచ్‌సీయూ విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు పక్షులు , జంతువులను గుర్తుంచుకోవాలని కోరింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక క్లిప్‌ను యాడ్ చేసి రష్మి గౌతమ్ ఈ వీడియోను పోస్ట్ చేసింది, అందులో హెచ్‌సీయూ దగ్గర ఉన్న భూమిపై చెట్లు నరికివేస్తుండగా.. అక్కడ ఉన్న నెమళ్లు దారుణంగా ఏడుస్తున్నట్లు చూపించారు.
“నేను ఈ వీడియోను పోస్ట్ చేసిన తర్వాత నాకు చాలా వ్యతిరేకత వస్తుంది. అయితే, ఈ వీడియో ఏ రాజకీయ ఆలోచనా విధానానికి వ్యతిరేకం కాదు. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ లేదా మన దేశంలోని ఏ అభివృద్ధి పనులకు వ్యతిరేకంగా కూడా నేను ఈ వీడియోను పోస్ట్ చేయడం లేదు.” అన్నారు.
View this post on Instagram
ఆ తర్వాత ఆమె... “హెచ్‌సీయూలో జరుగుతున్న పోరాటం అందరికీ తెలుసు. అందరూ సోషల్ మీడియాలో ఆల్ ఐస్ ఆన్ హెచ్‌సీయూ అని పోస్ట్ చేస్తున్నారు. నేను చాలా కంఫర్ఖబుల్‌గా నా అపార్ట్‌మెంట్ నుంచి ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నాను. ఈ అపార్ట్‌మెంట్ నిర్మించినప్పుడు, చాలా చెట్లు మరియు జంతువులు చనిపోయి ఉంటాయని నాకు కూడా తెలుసు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని.. ఈ వీడియోను చేసేసి... ఏది సరైనది, ఏది తప్పు అని మాట్లాడటం చాలా సులభం.” అని కామెంట్ చేసింది. కానీ ఒక సామాన్యురాలిగా, ఈ సమస్య ఎందుకు వచ్చిందనే దాని గురించి అంత డీటైయిల్డ్‌గా తెలీదు అని పేర్కొంటూ, “దాని చట్టపరమైన అంశాలు ఏమిటి అన్న దానిపై నాకు అంతగా అవగాహన లేదు.” అన్నారు.
మనం మారడానికి ఇది అవకాశం
కంచ గచ్చిబౌలి భూ వివాదంపై చాలా మంది సెలబ్రిటీలు మాట్లాడారు. కల్కి డైరక్టర్ నాగ అశ్విన్, బహుాభాషా నటుడు ప్రకాశ్‌రాజ్, నటి రేణూ దేశాయ్ వంటి వారు ఇది సరైంది కాదన్నారు. తెలుగులో సెలబ్రిటీ యాంకర్‌గా ఉన్న రష్మి కూడా ఇప్పుడు ఆ జాబితాలో చేరింది. తనకు రాజకీయాలతో సంబంధం లేదని.. కేవలం మూగ జీవాల ఆవేదన చూడలేకనే ఇలా మాట్లాడుతున్నా అని ఆమె చెప్పుకొచ్చింది. ముందు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. కనీసం పక్షులు, జంతువులు అరుస్తున్న వీడియో చూశాక అయినా మారాలని కోరింది.
"సాధారణ వ్యక్తిగా, నిన్న రాత్రి విడుదలైన ఆ వీడియోలో ఆ పక్షులన్నీ ఏడుస్తున్న శబ్దం విన్న తర్వాత - ఆ పక్షులు, నెమళ్లు మాత్రమే కాదు, అక్కడ నివసిస్తున్న మరెన్నో జాతుల జింకలు జంతువులు ఉన్నాయి. ఇది మనల్ని మనం తిరిగి సరిచేసుకునే అవకాశం కావచ్చు.” అన్నారు. వేసవి లో ఎండలు పెరుగుతున్న ఈ టైమ్‌లో "ఆ జంతువులను మరియు పక్షులను వాటి ఇళ్ల నుండి వెళ్లగొట్టడం ఎంతవరకు సరైనదో నాకు తెలియదు.”
ఇప్పటికైనా ఈ విషయాన్ని మరోసారి ఆలోచించాలని రష్మీ కోరింది. “ మీకు పవర్ ఉంది. ఆ జంతువులను పునరావాసం చేయడానికి అవకాశం ఉన్న ఏకైక ఆప్షన్ కూడా మీరే కాబట్టి, నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, దయచేసి ఆ జంతువులు, పక్షులను కూడా గుర్తుంచుకోండి. మీరు తదుపరి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటిపట్ల పాజిటివ్‌గా ఉండండి, ఈ విషయం మన ప్రభుత్వానికి చేరుకుని వారు ఈ జంతువులను పునరావాసం చేసి తర్వాత వారి తదుపరి చర్య తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మంచి కోసం ఆశిద్దాం.” వీడియోను ముగించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

