ధనుష్ వర్సెస్ నయనతార - అసలేం జరిగింది?

Published by: Saketh Reddy Eleti
Image Source: X/Twitter

ప్రముఖ హీరో, నిర్మాత ధనుష్‌కు నయనతార రాసిన ఓపెన్ లెటర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Image Source: X/Twitter

తమ డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దాన్’కు సంబంధించిన కంటెంట్ ఉపయోగించడానికి ధనుష్ ఒప్పుకోలేదని అందులో పేర్కొన్నారు.

Image Source: nayanthara Instagram

‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాకు ధనుషే నిర్మాతగా వ్యవహరించారు.

Image Source: nayanthara Instagram

రెండు సంవత్సరాలు ధనుష్ ఎన్ఓసీ కోసం తాము ఎదురుచూసినట్లు నయన్ తన లేఖలో పేర్కొన్నారు.

Image Source: Sun Pictures

ధనుష్ ఎన్ఓసీ ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో ఆ కంటెంట్ లేకుండానే డాక్యుమెంటరీ విడుదల అయింది.

Image Source: Vidnesh Shivan Instagram

ట్రైలర్‌లో ‘నానుమ్ రౌడీ దాన్’ షూటింగ్‌కు సంబంధించి మూడు సెకన్ల క్లిప్‌ను ఉపయోగించారు.

Image Source: Vidnesh Shivan Instagram

దానికి రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ ధనుష్ లీగల్ నోటీసులు పంపించినట్లు నయన్ తన లెటర్‌లో తెలిపారు.

Image Source: Vidnesh Shivan Instagram

కనీసం సాంగ్స్ నుంచి లిరిక్స్ కూడా ఉపయోగించడానికి వీల్లేదని ధనుష్ చెప్పడం తన హృదయాన్ని బద్దలు చేసిందని నయన్ అన్నారు.

Image Source: Vidnesh Shivan Instagram

మరి దీనికి ధనుష్ ఏం రిప్లై ఇస్తారో చూడాల్సి ఉంది.

Image Source: Vidnesh Shivan Instagram