నయనతార వ్యక్తిగత జీవితంలో ఎన్నో వివాదాలు.. ప్రస్తుతం ధనుష్ తో!

Published by: RAMA

ఎన్నో అడ్డంకులు

లేడీ సూపర్ స్టార్ గా వెలుగుతున్న నయనతార జీవితం ఇప్పుడు అందంగా కనిపిస్తోంది కానీ ఆమె వ్యక్తిగత జీవితంలో చాలా అడ్డంకులు దాటుకుని వచ్చింది

శింబుతో ప్రేమాయణం

ఇండస్ట్రీలో అడుగుపెట్టిన స్టార్టింగ్ లో శింబుతో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్స్ వచ్చాయ్..కానీ ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు

ప్రభుదేవాతో ప్రేమ

ఆ షాక్ నుంచి తేరుకున్న తర్వాత ప్రభుదేవాతో ప్రేమలో పడి పెళ్లికి సిద్ధమైంది..ఇందుకోసం తన మతాన్ని కూడా మార్చుకుంది

మళ్లీ నిరాశే

శ్రీరామరాజ్యం తన ఆఖరి సినిమా అని ఫిక్సైపోయింది.. ప్రభుదేవాతో అందమైన జీవితాన్ని ఊహించుకుంది..కానీ ఆ ప్రేమకథ కూడా పెళ్లివరకూ వెళ్లలేదు

విగ్నేష్ పరిచయం

దర్శకుడు విగ్నేష్ శివన్ తో పరిచయం నయనతార జీవితాన్ని మార్చేసింది. గత అనుభవాల వల్లనో ఏమో మూడోసారి ప్రేమ , పెళ్లి విషయంలో తొందరపడలేదు నయన్

నెరవేరిన పెళ్లి కల

ఏడేళ్ల పాటూ విగ్నేష్ తో కలసి ప్రయాణం చేసింది..ఒకర్నొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఏడు అడుగులు వేశారు..

కవల పిల్లలు

పెళ్లైన నాలుగు నెలలకే కవల పిల్లలకు తల్లిదండ్రలయ్యారు..ఈ విషయంపైనా వివాదం రేగింది.. నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నారనే విమర్శలొచ్చాయి

వివాదానికి చెక్

తమకు కొన్నేళ్ల క్రితమే పెళ్లి జరిగిందని...సరోగసికి తాము అర్హులం అని నయనతార అధికారులకు పత్రాలు సమర్పించడంతో వివాదం సర్దుమణిగింది

ధనుష్ తో వివాదం

ఇప్పుడు నయనతార: బీయాండ్‌ ది ఫెయిరీటేల్‌ అనే పేరుతో నెట్ ఫ్లిక్స్ లో వస్తోన్న డాక్యుమెంటరీకి సంబంధించి వివాదం నడుస్తోంది

పర్మిషన్ కోసం ప్రయత్నం

తాను నటించిన, విగ్నేష్ ని పరిచయం చేసిన..నానుమ్ రౌడీ ధాన్ మూవీకి సంబంధించిన క్లిప్స్, లిరిక్స్ తమ డాక్యుమెంటరీలో వాడుకుంటానన్న నయన్ కి పర్మిషన్ ఇవ్వలేదు ధనుష్..

లెటర్ తో కలకలం

తన సొంతంగా షూట్ చేసుకున్న క్లిప్స్ వినియోగించినా కూడా ధనుష్ అభ్యంతరం తెలిపాడు..దీంతో ధనుష్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ లెటర్ రిలీజ్ చేసింది నయనతార...