రీ-ఎంట్రీ కి రెడీగా ఉన్న 60 ఏళ్ల మీనాక్షి శేషాద్రి
మీనాక్షి శేషాద్రి అనగానే మీకు గుర్తొచ్చిందో లేదో చిరంజీవి 'ఆపద్భాంధవుడు' సినిమాలో అవురా అమ్మకు చెల్లా సాంగ్ లో కనిపించే హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుపట్టి ఉంటాకు
గుండ్రటి బొట్టు, వాలుజడ, లంగా ఓణీలో నది ఒడ్డున చిరంజీతో కలసి స్టెప్పులేసిన మీనాక్షి అంటే అప్పట్లో కుర్రాళ్ల కలల రాణి
సౌత్ లోనే కాదు నార్త్ లోనూ వరుస సినిమాల్లో నటించిన మీనాక్షి శేషాద్రి. బాలీవుడ్‌లో అగ్రహీరోల సినిమాల్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది
అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, జీతేంద్ర, వినోద్ ఖన్నా, శత్రుఘ్న సిన్హా వంటి స్టార్ హీరోలతో కలసి స్క్రీన్ షేర్ చేసుకుంది మీనాక్షి శేషాద్రి
1996 తర్వాత ఇండస్ట్రీ నుంచి దూరమై అమెరికాలో స్థిరపడింది మీనాక్షి..మళ్లీ 1998 లో స్వామి వివేకానందలో గెస్ట్ రోల్ చేసింది.. ఆ తర్వాత 2016లో ఘయాల్: వన్స్ ఎగైన్ మూవీలో నటించింది
1996 తర్వాత అడపా దడపా మెరిసి మాయమైన మీనాక్షి శేషాద్రి ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతోంది..
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మీనాక్షి శేషాద్రి ఎప్పటికప్పుడు వీడియోస్, ఫొటోస్ షేర్ చేస్తుంటుంది
ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్ కోసం ఇలా ముస్తాబైంది మీనాక్షి శేషాద్రి