దర్శకుడు క్రిష్ కి మళ్లీ పెళ్లి .. వధువు ఎవరంటే! క్రియేటీవ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలతో, క్రియేటివ్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న క్రిష్ ప్రస్తుతం అనుష్కతో 'ఘాటీ' సినిమా చేస్తున్నారు రీసెంట్ గా రిలీజైన ఘాటీ ఫస్ట్ లుక్, గ్లింమ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది..వేదం తర్వాత అనుష్కతో మరోసారి క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది కెరీర్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న క్రిష్..వ్యక్తిగత జీవితంలోనూ సెటిలవ్వాలని అనుకుంటున్నాడట..అందుకే మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఫిక్సయ్యారు క్రిష్ ఇదివరకే రమ్య అనే డాక్టర్ ని 2016 ఆగస్టు 7న వివాహం చేసుకొన్నారు. రెండేళ్ల వ్యవధిలోనే పరస్పర అంగీకారంలో విడాకులు తీసుకున్నారు లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. డాక్టర్ ప్రీతి చల్లాను క్రిష్ రెండో వివాహం చేసుకోవాలి అనుకున్నారు..ఆమెకు కూడా ఇది సెకెండ్ మ్యారేజే. డాక్టర్ ప్రీతి చల్లా గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ . నవంబర్ 10వ తేదీన వివాహం , నవంబరు 16న రిసెప్షన్ నిర్వహించనున్నారని సమాచారం గమ్యం సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన క్రిష్..వరుస హిట్స్ అందుకున్నారు. వేదం, కృష్ణం వందే జగద్గురు, గౌతమి పుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక, మణికర్ణిక, కొండపొలం సినిమాలకు దర్శకత్వం వహించారు హరిహర వీర మల్లు సినిమా బాధ్యతల నుంచి తప్పుకున్నారు..ప్రస్తుతం ఘాటీ మూవీతో బిజీగా ఉన్నారు