హీరో సూర్యను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది ఈ సినిమాలే
సూర్యని తెలుగు ఆడియన్స్‌కి దగ్గర చేసిన చిత్రం గజిని. ఈ సినిమా తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అది ఒక డబ్బింగ్ సినిమా అని.. సూర్య తమిళ హీరో అని కూడా మరచిపోయి గజినిని హిట్ చేశారు.
ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సూర్య కెరీర్లో మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. సూర్య, జ్యోతిక, భూమిక నటించిన ఈ సినిమా తెలుగులో మంచి క్రేజ్ దక్కించుకుంది.
ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత హిట్ అయిందో.. రీ రిలీజ్‌కి కూడా అంతే క్రేజ్ సంపాదించుకుంది. బ్రేకప్ అయిన ప్రతి అబ్బాయికి ఇదో మోటీవేషనల్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో సూర్య నటనకు, సాంగ్స్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చింది.
7th సెన్స్ కూడా సూర్యను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమాల్లో ఒకటి. బౌద్ధి ధర్ముడిగా సూర్య నటనను, సినిమాలోని సాంగ్స్‌ను అభిమానులు బాగా రిసీవ్ చేసుకున్నారు.
యముడు, సింగం సిరీస్‌కి కూడా టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. సూర్య పోలీస్ ఆఫీసర్‌గా చేసిన ఈ సినిమాలంటే ఇప్పటికీ తెలుగు ఆడియన్స్‌లో మంచి అభిప్రాయం ఉంది.
బేసికల్లీ ఐయామ్ వాచ్ మెకానిక్ అంటూ సూర్య చేసిన సందడి.. టాలీవుడ్ ఆడియన్స్‌కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. 24 సినిమా కూడా డబ్బింగ్ సినిమానే అయినా.. దానిని తెలుగు సినిమా మాదిరిగానే హిట్ చేశారు.
కరోనా తర్వాత.. ఓటీటీల్లోకి వచ్చిన హిట్ సినిమాల్లో ఆకాశమే నీ హద్దురా సినిమా కూడా ఒకటి. ఈ సినిమా చాలామంది యువతను ఇన్స్పైర్ చేసింది. సూర్య నటన, సాంగ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
జై భీమ్ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. లాయర్‌గా సూర్య పాత్రకు, కథకు తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ సినిమాకు కూడా మంచి టాక్ దక్కింది.
విక్రమ్ సినిమాలో సూర్య ప్రధాన హీరో కాకపోయినా.. రోలెక్స్ అనే పాత్రకు ఆడియన్స్ మ్యాడ్ అయిపోయారు. కేవలం ఈ పాత్ర కోసం టాలీవుడ్ ఆడియన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. రోలెక్స్ పాత్రలో సూర్య నటనకు జెన్ జి కిడ్స్ కూడా ఫ్యాన్స్‌గా మారిపోయారు.
యువ, వీడొక్కడే, రక్తచరిత్ర, ఘటికుడు, బ్రదర్స్, మేము వంటి ఇలా ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు సూర్యని దగ్గర చేశాయి. అతని స్టోరి సెలక్షన్స్, నటన ఎందరో అభిమానులను తెచ్చిపెట్టాయి.
కంగువ విడుదలకు ముందే తెలుగులో మంచి బజ్‌ని క్రియేట్ చేస్తుంది. అలాగే సూర్య అప్ కమింగ్ సినిమాలకు కూడా ఇదే రేంజ్ వెల్కమ్ ఇస్తారు తెలుగు ఆడియన్స్.