abp live

జేజమ్మ టు ఘాటి .. అనుష్క మైండ్ బ్లోయింగ్ లుక్స్!

Published by: RAMA
అరుంధతి
abp live

అరుంధతి

అనుష్క కెరీర్ ని ఊహించని మలుపు తిప్పిన సినిమా. అప్పటివరకూ గ్లామర్ డాళ్ గా ఉన్న అనుష్క నటవిశ్వరూపం చూపించిన మూవీ ఇది

జేజమ్మ
abp live

జేజమ్మ

సినిమా ఆరంభంలో గ్లామరస్ గా కనిపించిన అనుష్క..ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో జేజమ్మగా కనిపించేసరికి ప్రేక్షకుల నోట మాటరాలేదు. ఆ లుక్, నటనకు ఫిదా కానివారు లేరు..

పంచాక్షరి
abp live

పంచాక్షరి

అరుంధతి సక్సెస్ తర్వాత వరుసగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించింది అనుష్క. అందులో ఒకటి పంచాక్షరి.. ఈ మూవీలో లుక్ కూడా ఇంచుమించు జేజమ్మలానే ఉంటుంది

abp live

భాగమతి

అనుష్క నటవిశ్వరూపం చూపించిన మరో సినిమా భాగమతి. హిస్టారికల్ మూవీలా సాగే ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో.. అన్యాయాన్ని ఎదిరించే IAS ఆఫీసర్ గా అద్భుతంగా నటించింది అనుష్క

abp live

బాహుబలి

బాహుబలి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పుల్లలు ఏరుకునేందుకు పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్పా అంటూ ఫేస్ టర్నింగ్ ఇచ్చే సీన్ కి విజిల్సే

abp live

ఘాటి

నవంబరు 07 అనుష్క బర్త్ డే సందర్బంగా రిలీజ్ చేసిన ఘాటీ లుక్ చూసి అవాక్కయ్యారంతా.. బంగ్ తాగుతూ కళ్లలో క్రోధంతో కనిపించింది

abp live

ఘాటి

స్వీటీ అని ముద్దుగా పిలుచుకునే ప్రేక్షకులను ఘాటిలో లుక్ తో వణికించింది అనుష్క. ఓ వ్యక్తి తలను కోసేసి తీసుకెళ్లే సీన్ వామ్మో.. చెప్పలేం అంతే..

abp live

అనుష్క మ్యాజిక్..

ఎంత భయపెట్టే లుక్ లో కనిపించినా స్క్రీన్ పై అనుష్క కనిపిస్తే ప్రేక్షకులు రెప్పవేయరంతే..అదే అనుష్క మ్యాజిక్..