టాప్ సినిమాలివే

అనుష్కను స్టార్ హీరోయిన్​గా మార్చిన సినిమాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

అనుష్క ఎర్లీ కెరీర్

అనుష్క శెట్టి అసలు పేరు స్వీటి శెట్టి. సినిమాల్లోకి రాకముందు అనుష్క సోషల్ టీచర్​గా, యోగా ఇన్​స్ట్రక్టర్​గా వర్క్ చేసింది.

యాక్టింగ్ కెరీర్​

పూరిజగన్నాథ్ దర్శకత్వంలో.. నాగార్జున హీరోగా చేసిన సూపర్ సినిమాతో అనుష్క తన కెరీర్​ను మొదలు పెట్టింది. ఆ సినిమాలో గ్లామరస్​ పాత్రలో సెకండ్ హీరోయిన్​గా చేసింది అనుష్క.

విక్రమార్కుడు..

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమాతో అనుష్కకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ఆమె నటనకు తెలుగు కుర్రకారు ఫిదా అయిపోయింది. అనుష్క కోసమే మళ్లీ మళ్లీ సినిమా చూసినవారు కూడా ఉన్నారు.

లక్ష్యం

లక్ష్యం సినిమా కమర్షియల్ హిట్ అందుకుంది అనుష్క. గోపిచంద్​తో చేసిన ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురింపించింది. అనుష్క అందానికి, నటనకు అభిమానులు పెరుగుతూ వచ్చారు.

అరుంధతి..

అనుష్కను స్టార్​ హీరోయిన్​గా చేసిన సినిమా అరుంధతి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన హీరోయిన్ సెంట్రిక్ సినిమా అనుష్కను టాప్​లో నిలబెట్టింది. తెలుగులోనే కాకుండా.. ఇతర భాషల్లోనూ ఆమెకు మంచి గుర్తింపును తెచ్చింది. ఈ సినిమాకు నంది అవార్డు కూడా అందుకుంది.

వేదం సినిమాతో వేశ్యగా

స్టార్​ హీరోయిన్​గా మారిన అనుష్క వేశ్యగా చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇలా చేస్తే ఛాన్స్​లు వస్తాయో రావో అని భయపడతారు. కానీ వేశ్య పాత్రకు స్వీటి.. స్వీట్​నెస్ తీసుకొచ్చింది. హీరోయిన్​గా ఉంటూ ఈ తరహా క్యారెక్టర్ చేసిన అనుష్క గట్స్​కి హ్యాట్సాఫ్ చెప్పాలి.

ఖలేజా

ఖలేజా సినిమాలో హీరోయిన్​ని ఐరన్​ లెగ్​గా, ఆమె వల్ల నెగిటివ్​ వస్తుందనే విధంగా క్యారెక్టర్ డిజైన్ చేసినా.. స్వీటి ఆ సినిమా చేసి మరోసారి ప్రేక్షకులకు దగ్గరైంది.

భాగమతి

హీరోయిన్ సెంట్రిక్ పాత్రలో భాగమతి సినిమాతో బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టింది అనుష్క. హీరోల సినిమాలకు ధీటుగా ఈ సినిమా కలెక్షన్లు రాబట్టింది.

బాహుబలి

బాహుబలి సినిమాలో ప్రభాస్​కి తల్లిగా చేసి అందరినీ షాక్​కి గురిచేసింది అనుష్క. మిర్చిలో ప్రభాస్​తో రోమాన్స్ చేసి.. బాహుబలిలో ఇలాంటి పాత్ర చేసి అందరిని విస్మయానికి గురిచేసింది స్వీటి.

సైజ్ జీరో..

ఇప్పటికీ అనుష్క అభిమానులు ఆ ఒక్కసినిమా చేయకపోతే బాగుండు అనే సినిమానే సైజ్ జీరో. ఎందుకంటే ఈ సినిమా కోసం అనుష్క లావుగా మారింది. సహజంగా కనిపించాలని లావుగా మారి ఇప్పటికీ బరువు తగ్గడంలో ఇబ్బందులు పడుతుంది. మహిళల్లో పాజిటివిటీ తీసుకోరావలనే ఉద్దేశంతోనే స్వీటి ఈ సినిమా చేసింది.

మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి

వయసులో తనకంటే చిన్నవాడైన నవీన్ పోలిశెట్టితో.. పెళ్లి చేసుకోకుండా ప్రెగ్నెన్సీ అనే కాన్సెప్ట్​తో వచ్చి ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేసింది స్వీటి.

మరిన్ని సినిమాలు

బిల్లా, మిర్చి, శౌర్యం, పంచాక్షరి, సింగం ఇలా ఎన్నో సినిమాలు అనుష్కను ప్రేక్షకులకు దగ్గర చేశాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలతో స్వీటి మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.