ఈ బర్త్‌డేకి షారుక్ ఈసారి ఎందుకు కనిపించలేదు? - కారణం అదేనా? ప్రతి సంవత్సరం లాగా షారుక్ ఖాన్ ఈసారి మన్నత్ దగ్గర ఫ్యాన్స్‌కు కనిపించలేదు. సాధారణంగా ప్రతి ఏటా షారుక్ అక్కడ ఫ్యాన్స్‌ను పలకరిస్తారు. కానీ ఈ సంవత్సరం సెక్యూరిటీ రీజన్స్ కారణంగా షారుక్ రాలేదు. బాబా సిద్ధిఖీ హత్య తర్వాత బాలీవుడ్ సెలబ్రిటీలు హై అలెర్ట్‌లో ఉన్నారు. పోలీసుల సూచన కారణంగానే షారుక్ ఈసారి బర్త్‌డేకి బయటకు రాలేదని తెలుస్తోంది. ఉదయం 9:30 గంటల నుంచే పోలీసులు మన్నత్ దగ్గర ఫ్యాన్స్‌ను క్లియర్ చేయడం ప్రారంభించారు. దీని కారణంగా షారుక్ ఇంటి పరిసరాలు కూడా చాలా సైలెంట్‌గా ఉన్నాయి. అక్కడికి ఎవర్నీ పోలీసులు రానివ్వలేదు కూడా. అందుకే ఫ్యాన్స్ అక్కడికి రాలేకపోయారు. దీంతోపాటు షారుక్ ఖాన్ తర్వాతి సినిమా ‘కింగ్’ అప్‌డేట్ కూడా రాలేదు.