వజ్రోత్సవాల్లో ఏం జరిగింది - చిరంజీవి లెజండరీ పురస్కారం ఎందుకు తీసుకోలేదు!

Published by: RAMA

రచ్చ గెలిచాను కానీ..

ఇండస్ట్రీలో నేను తొలుత రచ్చ గెలిచాను..నా ఇల్లు అనుకునే పరిశ్రమలో ఆ అవకాశం టాలీవుడ్‌ వజ్రోత్సవాల సమయంలో వచ్చింది. లెజెండరీ పురస్కారం అందిచాలనుకున్నారు.. చాలా సంతోషం అనిపించింది

హర్షించని మనస్తత్వాలు

కానీ..ఆ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితులు, కొందరు హర్షించకపోవడం కారణంగా ఆ పురస్కారం తీసుకోవడం సముచితం అనిపించలేదు.. అందుకే ఆ అవార్డుని ఓ క్యాప్సుల్ బాక్స్ లో పడేశాను...

ఇప్పుడు ఇంట గెలిచాను..

అర్హత వచ్చినరోజే ఆ అవార్డ్ తీసుకుంటానని ఆ రోజు చెప్పాను...ఆ రోజు నేను ఇంట గెలవలేదు..ఇప్పుడు ANR అవార్డ్ అందుకున్నా ఈ రోజు ఇంట గెలిచాను..రచ్చ గెలిచాను..అందుకే ఈ పురస్కారం నాకు చాలా ప్రత్యేకం..

అసలేేం జరిగింది?

ఇంతకీ అప్పుడు ఏం జరిగిందంటే.. జనవరి 28, 2007... సినీ వజ్రోత్సవాల వేదిక.. వజ్రోత్సవ కమిటీ 'లెజెండ్ ఆఫ్ తెలుగు సినిమా'తో చిరంజీవిని సత్కరించాలని భావించారు

మోహన్ బాబు క్వశ్చన్

అదే వేదికపై మాట్లాడిన మంచు మోహన్ బాబు..తన సీనియారిటీ, విజయాల లిస్ట్ చెబుతూ తనకెందుకు ఆ అవార్డ్ ఇవ్వరు అని క్వశ్చన్ చేశారు..

సమయం నిర్ణయిస్తుంది!

ఆ మాటలు విన్న చిరంజీవి..తనకు అందించిన 'లెజెండ్ ఆఫ్ తెలుగు సినిమా అవార్డు' జ్ఞాపికను, శాలువాను 'టైమ్ క్యాప్సూల్ బాక్స్'లో వేసి...ఈ అవార్డు తీసుకునేందుకు నేను అర్హుడినా కాదా అని 25 ఏళ్ల తర్వాత ప్రజలు నిర్ణయిస్తారన్నారు

నా కష్టానికి ఇదే గుర్తింపు

తన నటన, కష్టపడే తత్వమే ఆ దిశగా నడిపిస్తుందని చిరంజీవి విశ్వాసం..అందుకే సమయం అన్నిటికీ సమాధానం చెబుతుందని ఆ అవార్డును టైమ్ క్యాప్సూల్ బాక్సులే వేసేశారు.

ఈ అవార్డ్ ప్రత్యేకం

ఇంకా 25 ఏళ్లు గడవనే లేదు..ఈ లోగా మెగాస్టార్ సాధించినవెన్నో.. పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌, గిన్నిస్‌ బుక్‌లో స్థానం ..లేటెస్ట్ గా ANR అవార్డ్ ఇలా మెగాస్టార్ మెగాస్టార్ గానే వెలుగుతున్నారు...

ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను

ANR అవార్డు తీసుకునే వేదికపైనా ఇదే విషయాన్ని ప్రస్తావించారు చిరంజీవి.. అందుకే ఇప్పుడు ఇంట గెలిచాను రచ్చ గెలిచాను అన్నారు. ఈ విషయం స్టేజ్ పై చెప్పాలనుకున్నాను..ఇప్పుడు చెప్పానంటూ తన ఆనందాన్ని వ్యక్తంచేశారు చిరంజీవి